Breaking News

ఆయుర్వేద దినోత్సవం – 2026 సందర్భంగా వివిధ కార్యక్రమాల నిర్వహణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ, విజయవాడలో ఆయుర్వేద దినోత్సవం–2026ను పురస్కరించుకొని 10.09.2026 నుండి 23.09.2026 వరకు వివిధ అవగాహనా మరియు సేవా కార్యక్రమాలను నిర్వహించినట్లు సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్‌చార్జి డా. సి. మురళీకృష్ణ తెలిపారు.

ఆయుర్వేద వైద్య విధానం యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం, ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించడం మరియు ఆయుర్వేదాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడం ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశ్యంగా ఉందని తెలిపారు. సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్‌చార్జి డా. సి. మురళీకృష్ణ మార్గదర్శకత్వంలో, ఆయుర్వేద విభాగానికి చెందిన పరిశోధన అధికారి డా. యు. ఆర్. శేఖర్ నంబూరి మరియు ఇతర పరిశోధనాధికారులు డా. సవిత పి. గోపోడ్, డా. సుజాత పి. ధోకే, డా. అనుమోల్ కె., డా. నిషాంత్ తదితరుల సహకారంతో ఈ కార్యక్రమాలను నిర్వహించారు.

ఆయుర్వేద దినోత్సవ వేడుకల్లో భాగంగా సంస్థకు వచ్చే బాహ్య రోగులు మరియు అంతర్గత రోగులకు ఉచిత రక్త నమూనాల సేకరణ, వైద్య శిబిరం, ఔషధ మొక్కల పంపిణీ, వివిధ వైద్య మరియు ఆరోగ్య అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలు మరియు రోగులకు ఆయుర్వేద వైద్య విధానం, ఆరోగ్య సంరక్షణ మరియు వ్యాధి నివారణలో ఆయుర్వేదం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. విద్యార్థుల్లో ఆరోగ్యం, ప్రకృతి మరియు ఆయుర్వేదంపై ఆసక్తిని పెంపొందించేందుకు రాజీవ్ నగర్ మున్సిపల్ గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు చిత్రలేఖన పోటీ మరియు వ్యాస రచన పోటి నిర్వహించారు. సంస్థ అధికారులకు మరియు సిబ్బంది కోసం స్లోగన్ పోటీ, క్విజ్ పోటీ, వంటల పోటీ, రంగోలి పోటీ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అదేవిధంగా సిబ్బంది ఉత్సాహంగా పాల్గొనే విధంగా వివిధ వినోదాత్మక ఆటలు మరియు సరదా కార్యక్రమాలు కూడా నిర్వహించారు.

ఈ కార్యక్రమాల ద్వారా విద్యార్థులు, అధికారులు, సిబ్బంది, రోగులు మరియు ప్రజల్లో ఆయుర్వేదం, ఆరోగ్యకరమైన ఆహారం, ప్రకృతి ఆధారిత జీవనశైలి మరియు సమగ్ర ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించేందుకు కృషి చేశారు. ఆయుర్వేద దినోత్సవం–2026 సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమాలు ఆయుర్వేద సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో మరియు ఆయుర్వేదంపై అవగాహన పెంపొందించడంలో ఎంతగానో దోహదపడాలి అని డా సి మురళి కృష్ణ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *