Breaking News

సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వరకు మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్


-తెలుగు రాష్ట్రాల మధ్య తొలి వందే భారత్ ఎక్స్‌ప్రె ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు
-సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానుక

సికింద్రాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వరకు మొదటి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి రిమోట్ వీడియో లింక్ ద్వారా ఈరోజు అనగా తేదీ 15 జనవరి 2023న జెండా ఊపి ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో డా. తమిళిసై సౌందరరాజన్, గవర్నర్, తెలంగాణ రాష్ట్రం , రైల్వే మంత్రి  అశ్విని వైష్ణవ్, సాంస్కృతిక, పర్యాటక మరియు అభివృద్ధి శాఖ & ఈశాన్య ప్రాంత ల అభివృద్ధి మంత్రి  జి. కిషన్ రెడ్డి,  మహమూద్ అలీ, హోం మరియు జైళ్ల శాఖ, తెలంగాణా రాష్ట్రం, టి. శ్రీనివాస్ యాదవ్, పశుసంవర్ధక, మత్స్య మరియు పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి, తెలంగాణ రాష్ట్రం. అలాగే తెలంగాణకు చెందిన డా. కె. లక్ష్మణ్, ఎంపీ, రాజ్యసభ, బండి సంజయ్ కుమార్, ఎంపీ,కరీంనగర్, అనిల్ కుమార్ లహోటి, రైల్వే బోర్డు ఛైర్మన్ మరియు CEO తో పాటుగా ఎస్‌సిఆర్‌ జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌, ఇతర సీనియర్‌ రైల్వే అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రదాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ మకర సంక్రాంతి సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక గొప్ప కానుక అని అన్నారు. కొత్త వందే భారత్ రైలు సికింద్రాబాద్, వరంగల్, విజయవాడ మరియు విశాఖపట్నం ప్రజలకు వేగవంతమైన కనెక్టివిటీని అందిస్తుందని మరియు ఈ ప్రాంత సామాజిక-ఆర్థిక అభివృద్ధికి కూడా దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ రైలు సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ప్రయాణ సమయాన్ని కూడా తగ్గిస్తుందని అన్నారు. భారత దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్నది అని చెప్పడానికి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఒక నిదర్శనమని అన్నారు. అలాగే ఆత్మ నిర్భర్ భారత్‌కు నిజమైన ఉదాహరణ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. దేశం సమగ్ర అభివృద్ధికి వివిధ ప్రాంతాల అనుసంధానం వల్ల వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సామాన్యులకు మెరుగైన కనెక్టివిటీని అందిస్తోందని ఆయన పేర్కొన్నారు. వందే భారత్ అభియాన్ దేశవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ఇప్పటి వరకు 40 లక్షల మంది ప్రయాణికులు ఈ రైలులో ప్రయాణించారని ఆయన తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం లో గడిచిన 8 సంవత్సరాలలో రైల్వే పరంగా పెద్ద ఎత్తున అభివృద్ధిని సాధించిందని శ్రీ నరేంద్ర మోదీ తెలియజేసారు. తెలంగాణ రాష్ట్రానికి 2022-23 సంవత్సరానికి బడ్జెట్‌లో రూ. 3,048 కోట్లు, 2014-15 సంవత్సరంలో చేసిన రూ. 258 కోట్లు మాత్రమే అని ఇది గతంతో పోలిస్తే దాదాపు 12 రెట్లు ఎక్కువ అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైలు మౌలిక సదుపాయాలను కేంద్రం పటిష్టం చేసిందని ఆయన పేర్కొన్నారు. మెరుగైన రైళ్ల అనుసంధానం వల్ల వ్యాపారాలకు మార్గం సుగమం చేసిందని మరియు ఈ ప్రాంతాలలో జీవన సౌలభ్యాన్ని మెరుగుపరిచిందని ఆయన తెలిపారు.

గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఈ రోజు భారతీయ రైల్వేలో అత్యంత ఆధునిక సాంకేతికత అభివృద్ధి ప్రత్యేకంగా వీక్షి స్తున్నామనీ పేర్కొన్నారు. భవిష్యత్తులో అత్యంత ఆధునిక రైలు సేవలను ప్రజలు చూడబోతున్నారని ఆమె తెలియజేశారు. వందే భారత్ రూపంలో స్థానికత యొక్క గొప్పతనం భారతీయ రైల్వేలలో కూడా ప్రత్యేక్షమూగ సాక్షాత్కరించిదని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సభను ఉద్దేశించి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ల మధ్య సామాజిక-ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ సంవత్సరం మకర సంక్రాంతి రోజున భారత దేశంలో స్వదేశీంగా రూపొందించిన సెమీ-హై స్పీడ్ రైలు – వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను రెండు తెలుగు రాష్ట్రాలకు తీసుకువస్తున్నట్లు తెలిపారు.

ఈ రెండు నగరాల పగటిపూట/ వేళల్లో ప్రయాణానికి ఇది మొదటి అత్యాధునిక రైలు అని, తెలుగు రాష్ట్రాల్లో మొదటి వందే భారత్ రైలు అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన రైల్వే బడ్జెట్ తెలంగాణలో రైల్వేలను పెద్దఎత్తున అభివృద్ధి చేసేందుకు అవకాశం కల్పిస్తోందని రైల్వే మంత్రి పేర్కొన్నారు. సికింద్రాబాద్ స్టేషన్‌ను ప్రపంచ స్థాయి సౌకర్యాలు, అత్యాధునిక వసతుల తో పునరభివృద్ధి చేస్తున్నామని తెలిపారు . తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 34 రైల్వే స్టేషన్లను త్వరలో పునరాభివృద్ధి పనులు చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు.

భారతీయ ఇంజనీర్ల మేధస్సు తో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను విజయవంతంగా ట్రాక్‌లపైకి తీసుకురావడానికి భారతీయ రైల్వే చేస్తున్న కృషిని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అభినందించారు. పవిత్రమైన మకర సంక్రాంతి రోజున సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించినందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల తరపున ప్రధానికి కిషన్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రైళ్ల మౌలిక సదుపాయాలు మరియు ప్రయాణీకుల సౌకర్యాలను మెరుగుపరడం కోసం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యేక దృష్టి సారించి, ప్రోత్సాహం అందించినందుకు రైల్వే మంత్రి మరియు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తక్కువ కాలంలోనే సికింద్రాబాద్‌ స్టేషన్‌ను ప్రపంచ స్థాయి సౌకర్యాలతో రూ.800 కోట్ల వ్యయంతో తీర్చిదిద్దుతామని తెలిపారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *