Breaking News

వినియోగదారులకు సంక్రాంతి కానుక…


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏడాది పొడుగునా పలు శుభ సందర్భాలను పురస్కరించుకొని వినియోగదారులకు విశేష సేవలను అందిస్తూ వస్తున్న విజయవాడ, ఎమ్.జి. రోడ్డులోని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ అధీకృత సంస్థ పైలెట్ సర్వీస్ స్టేషన్ (పెట్రోల్ బంక్) సంక్రాంతి పర్వదినాన వినియోగదారులు సభ్యుల ఫొటోతో కూడిన 2023 సంవత్సరం కలర్ఫుల్ క్యాలెండర్ను ఉచితముగా అందిజేయడం జరిగినది. దాదాపు 600 మంది వినియోదారులు తమ తమ కుటుంబ సభ్యులతో వచ్చి ఫొటోలు దిగి, వెనువెంటనే వారి వారి ఫొటోలతో ఉన్న క్యాలెండర్ను తమ వెంట తీసుకొని వెళ్ళడం జరిగినది. ప్రధానంగా మహిళలు, పిల్లలు పాల్గొని ఎంతో ఉత్సహంగా తమ ఆనందాన్ని వెలిబుచ్చినారు. ఈ సందర్భంగా పిల్లలకు స్వీట్స్, గాలిపటాలను యాజమాన్యం అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమములో సంస్థ అధిపతి ఎమ్.వి.వి. సత్యనారాయణ పాల్గొని గత 8 సంవత్సరాలుగా సంక్రాంతి పండుగకు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమములో ఐ.ఓ.సి.యల్. ఛీఫ్ డివిజనల్ రిటైల్ హెడ్ నరేంద్రమౌర్య, అనిల్, ఎన్.టి.ఆర్.జిల్లా సేల్స్ ఆఫీసర్ కె.వరప్రసాద్ మరియు సంస్థ మేనేజర్ కె.వెంకటప్పయ్య, నందకిషోర్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *