రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న విదేశీ విద్యా పథకం కోసం జిల్లాలో ఐదుగురు ఎంపిక అవ్వడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. గురువారం ఉదయం వెలగపూడి నుంచి సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జీ. జయలక్ష్మి జిల్లా కలెక్టర్ లతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించగా, స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో జగనన్న విదేశీ విద్యా పథకం కోసం దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లకు చెందిన విద్యార్థుల దరఖాస్తులు స్క్రూటిని అనంతరం జిల్లాలో ఎంపికైన అభ్యర్థుల వివరాలు, తదుపరి కార్యాచరణ ప్రణాళిక పై ముఖ్య కార్యదర్శి ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లాలో ఇద్దరు ఎస్సీ లు, ఇద్దరు బిసి లు, ఒక ముస్లిం మైనార్టీ కి చెందిన విద్యార్థులు విదేశీ విద్యా పథకం కింద ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు లో భాగంగా జగనన్న విదేశీ విద్య కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వనించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం అవలంబించిన పాత విధానాన్ని మెరుగుపరచడం మరియు విదేశీ విద్యాసంస్థలలో గుణాత్మక విద్యపై దృష్టి పెట్టడం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ దృక్కోణంలో అర్హులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించి వారిని స్వావలంబనగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిందన్నారు. విద్యార్థి చెల్లించ వలసి ఉన్న పూర్తి ఫీజులో 50 లక్షల వరకు రీయింబర్స్‌మెంట్ మొత్తం నాలుగు వాయిదాల రూపంలో నేరుగా విద్యార్థి బ్యాంకు ఖాతాలకు పంపబడుతుందన్నారు. ఈ పథకం ద్వారా విదేశాల్లో టాప్ 200 విశ్వవిద్యాలయా లలో అమలు చేయడం జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రూ.15 లక్షలు, బీసీ, కాపు అభ్యర్థులకు రూ.10 లక్షల వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అందించే వారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాడమే కాకుండా రూ.50 లక్షల వరకు ఫీజ్ రియంబర్స్ మెంట్ చేస్తుడడం జరుగుతోంది. ఈ సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి జీ. జనార్ధన రావు, జిల్లా ట్రైబల్ సంక్షేమ అధికారి కె ఎన్ జ్యోతి, కలెక్టరేట్ ఎ వో జీ. బీమా రావు లు పాల్గొన్నారు.