Breaking News

KSRTC తో APSRTC ఇంటర్ స్టేట్ ఒప్పందం

-ప్రయాణీకులకు ఇబ్బంది లేకుండా రెండు రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యం
-రానున్న 3 నెలలలో కార్యాచరణకు APSRTC సన్నాహాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రయాణీకుల అవసరాలకు అనుగుణంగా ఆలోచనలు చేస్తూ APSRTC మరింతగా ప్రణాళికలు చేస్తూ ముందుకెల్తోంది. దానిలో భాగంగా పొరుగు రాష్ట్రమైన కర్ణాటకకు బస్సు సర్వీసులు పెంచే విధంగా అడుగులు వేస్తోంది. KSRTCతో ఇంటర్ స్టేట్ ఒప్పందం కుదుర్చుకుంది.
వివిధ రకాలుగా ప్రయాణీకుల నుండి అభిప్రాయాలు సేకరించిన మేరకు కిలోమీటర్లు పెంచాలని apsrtc నిర్ణయించి పలు దఫాలుగా KSRTC అధికారులతో చర్చించారు. వరుస సమావేశాల తర్వాత ఎట్టకేలకు ఈ రోజు విజయవాడలో ఇరు ఆర్టీసీ ఎం.డి. ల మధ్య జరిగిన సమావేశంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఆర్టీసీ హౌస్ ప్రధాన కన్ఫరెన్స్ హాల్ లో జరిగిన ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మధ్య ప్రయాణీకులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు కొన్ని కొత్త రూట్ల ప్రతిపాదనలతో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ ప్రతిపాదనలు తొలిసారిగా APSRTC తీసుకొచ్చింది. AP ద్వారా 69,284 కిలోమీటర్లతో 327 బస్సులు పెంచాలని, అదేవిధంగా కర్ణాటక ద్వారా 69,372 కిలోమీటర్లతో 496 బస్సులను కొత్తరూట్లలలో పెంచడానికి ఇరు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరింది. ఈ mou అమలులోకి రావడంతో కర్ణాటకలో APSRTCకి చెందిన 1322 బస్సులు 2,34,762 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్ లో KSRTCకి చెందిన 1489 బస్సులు 2,26,044 కిలోమీటర్లు నడుస్తాయి. రెండు రాష్ట్రాల మధ్య ప్రజా రవాణా మెరుగుపరచడానికి చేసుకున్న ఈ రెండు STUల సిఫార్సులు సంబంధిత ప్రభుత్వాల పరిశీలనకు సమర్పించబడతాయి. రానున్న 3 నెలల వ్యవధిలో కార్యాచరణ అమలులోకి రావచ్చునని APSRTC భావిస్తోంది.
దీనికి సంబంధించి KSRTC MD వి.అంబు కుమార్, ఐ.ఏ.ఎస్., డైరెక్టర్(P&V) ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఐ.ఏ.ఎస్., CTM ఆపరేషన్స్ అంథోని జార్జ్, CTM కమర్షియల్ ఎస్.రాజేష్ ఈ రోజు విజయవాడలోని ఆర్టీసీ హౌస్ ని సందర్శించారు. KSRTC MD మరియు APSRTC ఎం.డి. సి హెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్. ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఇప్పటికే APSRTC మరియు OSRTC లు పరస్పరం ఒడిస్సా మధ్య బస్సులు పెంచేందుకు అంగీకరించి, ప్రభుత్వ సిఫార్సులు సమర్పించబడ్డాయి. ఈ ఇరు రాష్ట్రాల అంతరాష్ట్ర ఒప్పందంలో భాగంగా నడపవలసిన బస్సులు, రూట్ల జాబితాను డిసెంబర్ 12, 2022 న AP ప్రభుత్వం డ్రాఫ్ట్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ సమావేశంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కే.ఎస్. బ్రహ్మానంద రెడ్డి (ఆపరేషన్స్), ఏ.కోటేశ్వరరావు (అడ్మిన్), పి.కృష్ణ మోహన్ (ఇంజనీరింగ్), ఎఫ్.ఏ.& సి.ఏ.ఓ.  రాఘవ రెడ్డి, ఆర్టీసీ ఉన్నతాధికారులు మరియు KSRTC అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *