-విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకుని పక్కా ప్రణాళికతో ఉన్నత శిఖరాలకు అధిరోహించాలి…
-కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థినిలు లక్ష్యాలను నిర్దేశించుకుని, పక్కా ప్రణాళిక రూపొందించుకుని లక్ష్యాన్ని చేరుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత సూచిం చారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బిలిటీ (సీఎస్ ఆర్) ప్రోగ్రాం కింద 2015 నుంచి ప్రతియేటా మలబార్ గోల్డ్ చేసున్న కార్యక్ర మాల్లో భాగంగా తూర్పు గోదా వరి పాత జిల్లా ల్లోని 24 ప్రభు త్వ కళాశాలల్లో చదువుతున్న మెరిట్ విద్యార్ధినిలు 406 మందికి స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో సోమవా రం నిర్వహించిన కార్యక్రమంలో రు. 37.52 లక్షల రూపాయలు స్కాలర్ షిప్స్ పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ మాధవీలత ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్య తను కల్పిస్తుందన్నారు. నాడు నేడు ద్వారా పాఠశాలల ఆధునీకరణతో పాటు మౌలిక సౌకర్యాలను కల్పించింద న్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయి విద్యను అభ్యసించా లనే లక్ష్యంతో జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, గోరుము ద్ద, విదేశీ విద్య వంటి అనేక సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో పరిశ్రమలు, ఇన్స్టిట్యూట్స్ ముందుకు వస్తే పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో మరింత సమాజ అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థినీలు ప్రతి అవకాశాన్ని సద్వివినియోగం చేసుకోవాల న్నారు.
లక్ష్యాలను చేరుకోవాలంటే చిత్తశుద్ధి ఉండాలని, సమయ పాలన ముఖ్యమని, అలక్ష్యం పనికిరాదని కలెక్టర్ సూచిం చారు. మలబార్ గోల్డ్ పక్షాన ఇంత పెద్దఎత్తున స్కాలర్ షిప్స్ అందించడం అభినందనీయ మని ఆమె పేర్కొన్నారు. తాను కృష్ణా జిల్లాలో జేసీగా ఉండగా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొ న్నానని గుర్తుచేసు కున్నారు. ముందుగా మనలో ఉన్న బలాబలాలను గుర్తించి, వీక్ నెస్ లకు దూరం గా ఉంటూ బలోపేతం కావా లని విద్యార్థి నులకు కలెక్టర్ మాధవీలత సూచించారు.
ప్రముఖ మానసిక వైద్య నిపు ణులు, బిసి రాయ్ అవార్డు గ్రహీత డాక్టర్ కర్రి రామారెడ్డి మాట్లాడుతూ బాగా చదువు కుంటే కలెక్టర్, వంటి ఉన్నత స్థానాల్లోకి వెళ్లవచ్చని పేర్కొ న్నారు. లక్ష్యం నిర్దేశించు కుని, విలువైన సమయాన్ని దృష్టిలో ఉంచుకుని సమయ పాలన పాటిస్తూ అభివృద్ధిలోకి రావాలని ఆయన ఆకాంక్షిం చారు. మలబార్ గోల్డ్ వ్యాపారం చేస్తూ, లెక్కలు ఖచ్చితంగా చూపిస్తూ, ఇలా సామాజిక బాధ్యతతో కార్యక్ర మాలు చేయడం మామూలు విషయం కాదన్నారు.
మాల్ బార్ రాజమండ్రి స్టోర్ హెడ్, కె. ఫెబిన్,మలబార్ గోల్డ్ రాజమం డ్రి షోరూమ్ మేనేజర్, కె. వెంక ట లక్ష్మిపతి, మార్కటింగ్ మేనే జర్, ఏ. ప్రవీణ్ కుమార్, లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మా టూరి మంగతాయారు,ఇంటర్ బోర్డ్ ఆర్ జె డి,శారద, డివిఇ ఓ, జెవివి సుబ్రహ్మణ్యం, సి. హెచ్. జాన్సన్ తదితరులు మాట్లా డుతూ స్కాలర్ షిప్స్ పొందు తున్న విద్యార్థినిలు మరింతగా రాణించాలని సూచించారు.
విద్యార్థినులకు కలెక్టర్, అలాగే అతిధుల చేతుల మీదుగా స్కాలర్ షిప్స్ చెక్కులు అందజేశారు. తొలుత విద్యార్థినులు, మాట్లాడుతూ మలబార్ గోల్డ్ అందిస్తున్న స్కాలర్ షిప్స్ వలన తమ చదువు కొనసా గించడానికి వీలవుతుందని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రు లుమాట్లాడుతూ మలబార్ గోల్డ్ ఉదారతను కొనియా డారు.