ప్రజా సమస్యలపై స్పందనలో వచ్చిన అర్జీలు సత్వరమే పరిష్కరించాలి

-స్పందనలలో 18 అర్జీలను స్వీకరించిన నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజాసమస్యల పరిష్కార దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందనలో కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించి ప్రజలు తెలిపిన సమస్యలపై అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు ఆదేశాలు ఇచ్చారు. నగరపాలక సంస్థ ద్వారా కల్పిస్తున్న మౌలిక సదుపాయాలలో ప్రజలు తెలిపిన సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నేటి స్పందన కార్యక్రమములో పట్టణ ప్రణాళిక – 14 ఇంజనీరింగ్ – 2, రెవిన్యూ– 2, అర్జీలు వచ్చినవి. కార్యక్రమంలో అదనపు కమిషనర్ (జనరల్) శ్రీమతి యం.శ్యామల, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) శ్రీమతి కె.వి సత్యవతి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. పి.రత్నావళి, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి, జాయింట్ డైరెక్టర్ (అమృత్) డా.కె.బి.ఎన్.ఎస్ లతా, సిటీ ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, ఎస్.ఇ నరసింహ మూర్తి, మేనేజర్ బి.శ్రీనివాస్ రావు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

సర్కిల్ కార్యాలయాలలో స్పందన – 3 అర్జీలు.
జోనల్ కమిషనర్లు నిర్వహించిన స్పందన కార్యక్రమములో సర్కిల్ –3 కార్యాలయంలో ఇంజనీరింగ్ విభాగం – 1, సర్కిల్ –1 కార్యాలయంలో ఇంజనీరింగ్ విభాగం – 2 అర్జీలు, సర్కిల్ – 2 కార్యాలయంలో ఎటువంటి అర్జీలు అందనట్లు జోనల్ కమిషనర్ తెలియజేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *