Breaking News

శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించిన గవర్నర్ దంపతులు

-శ్రీ మల్లికార్జునస్వామి, శ్రీ భ్రమరాంబాదేవిలకు ప్రత్యేక పూజలు
-బిశ్వభూషణ్ దంపతులకు వేదపండితుల ఆశీర్వచనం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ గవర్నర్  బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతులు ప్రసిద్ధ శైవక్షేత్రమైన శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం విజయవాడ నుండి ప్రఃత్యేక హెలికాప్టర్ లో శ్రీశైలం చేరుకున్న గవర్నర్ తొలుత రత్నగర్భగణపతిస్వామి వారిని దర్శించుకుని హారతిని అందుకున్నారు. శ్రీమల్లికార్జునస్వామివారిని దర్శించుకుని రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లికా గుండంలో (సరస్వతీ నదీ అంతర్వాహిని) ప్రతిబింబించే ఆలయ విమాన గోపురాన్ని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ కుటుంబ సభ్యులను అర్చక స్వాములు, వేద పండితులు ఆశీర్వదించి, తీర్థప్రసాదాలను అందజేశారు. ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డి వారి చక్రపాణి రెడ్డి, దేవస్థానం ఈఓ లవన్నలు శేష వస్త్రాలు, లడ్డు ప్రసాదాలు, శ్రీస్వామి అమ్మవార్ల జ్ఞాపికను గవర్నర్ దంపతులకు అందచేశారు. తొలుత శ్రీశైలం గంగాధర మండపం చేరుకున్న రాష్ట్ర గవర్నర్ కుటుంబ సభ్యులకు అర్చకస్వాములు, వేదపండితులు ఆలయ మర్యాదలతో రాజగోపురం వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఉదయం పది గంటలకు సున్నిపెంట హెలిప్యాడ్‌కు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ దంపతులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామూన్, జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు గురుమహాంతు ఉమామహేష్, ఎం. విజయలక్ష్మి, ఎ . లక్ష్మీ సావిత్రి, మేరాజోత్ హనుమంత్ నాయక్, డా. కనకదుర్గ, ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు, కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *