-ముఖ ఆధారిత యాప్ లో సంబంధిత శాఖల సిబ్బంది నమోదు హాజరు డిడిఓలు పర్యవేక్షించాలి : కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ ఆధారిత హాజరు అమలులో భాగంగా ఎఫ్. ఆర్. ఎస్. యాప్ లో నమోదు కాకుండా ఇంకనూ మిగిలి ఉన్న ఉద్యోగులు అందరూ సత్వరమే ఎఫ్ఆర్ఎస్ యాప్ లో నమోదు చేసుకోవాలని దాని కొరకు సంబంధిత డి డి ఓ లు తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కే వెంకట రమణా రెడ్డి ఆదేశించారు.
బుధవారం ఉదయం తాడేపల్లి నుండి కార్యదర్శి ముత్యాల రాజు వారు సి ఎఫ్ ఎం ఎస్ అధికారి సునీల్ రెడ్డి తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ ఆధారిత హాజరుపై వర్చువల్ విధానంలో సమీక్షించగా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి, జే సి డి కే బాలాజీ, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస రావు సంబంధిత జిల్లా అధికారులతో హాజరయ్యారు.
విసి అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ చాలా శాఖలు యాప్ లో ఇప్పటికే నమోదు పూర్తి చేసారని, ఎక్కువ సిబ్బంది ఉన్న శాఖలు జిల్లా పంచాయితీ అధికారి, పంచాయితీ రాజ్ ఇంజినీరింగ్, మునిసిపల్ శాఖ, అటవీ శాఖ, వెటర్నరీ యూనివర్సిటీ రెవెన్యూ తదితర శాఖలు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టి పూర్తి చేయాలని సూచించారు. ముఖ ఆధారిత హాజరు యాప్ నందు నమోదు మరియు హాజరు 80 శాతం శాఖలలో పూర్తి అయిందని, దానిని వంద శాతం తప్పక అమలు చేయాలి అని డిడిఓ లు దీనిని పర్యవేక్షించాలని అన్నారు. సిబ్బంది అందరూ ఉదయం సాయంత్రం ముఖ ఆధారిత హాజరు నమోదు చేయాలని తెలిపారు. క్యాంపు లో వెళ్ళిన అధికారులు, ఆన్ డ్యూటీ లో ఇతర ప్రాంతంలో ఉన్న అధికారులు యాప్ లో ఉన్న నియమాల మేరకు తప్పక హాజరు వేయాలని సూచించారు. ఏదైనా సాంకేతిక సమస్యలు, సందేహాలు ఉంటే ఎన్.ఐ.సి. వారిని సంప్రదించాలని అన్నారు.
ఈ సమీక్షలో జిల్లా అధికారులు డి ఆర్ డి ఎ పిడి జ్యోతి డి ఎల్ డి ఓ సుశీల దేవి, డి పి ఓ రాజశేఖర్ రెడ్డి, జిల్లా పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారి శంకర్ నారాయణ, పథక సంచాలకులు డ్వామా శ్రీనివాస ప్రసాద్, ఎస్ ఈ ఆర్ డబ్లు ఎస్ విజయ్ కుమార్, జిల్లా సహకార అధికారి ఉమాదేవి, జిల్లా మేనేజర్ సివిల్ సప్లైస్ సుమతి తదితరులు పాల్గొన్నారు.