Breaking News

తుది దశకు చేరే లోగా పెండింగ్ పనులను  వేగవంతం చేయాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న భూ రక్షా, భూహక్కు పథకం కింద జిల్లాలో చేపడుతున్న సర్వే ప్రక్రియను పూర్తి చేసేందుకు జిల్లా స్థాయి నుంచి మండల, గ్రామ స్థాయి వరకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అమలు చేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. తుది దశకు చేరే లోగా పెండింగ్ పనులను  వేగవంతం చేయాలని సిసిఎల్‌ఎ  ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్, ఇతర అధికారులు, సిసిఎల్ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్, కమిషనర్ సిద్ధార్థ జైన్ అమరావతి నుంచి సర్వే పై సమీక్ష నిర్వహించారు.

సందర్భంగా సిసిఎల్‌ఎ సిసిఎల్ ఎ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ మాట్లాడుతూ రీసర్వే కార్యక్రమంలో భాగంగా తొలి దశ  ఫైనల్‌ ఆర్‌ఒఆర్‌, డిఎల్‌ఆర్‌ పెండింగ్‌ లేకుండా పూర్తి చేయాలన్నారు. ఎలాంటి తప్పులు లేకుండా భూ హక్కు పత్రాలు పరిశీలించి పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. రెండో దశ కి చెంది రెండు వేల గ్రామాలకు గాను రీ సర్వే లో చేపట్టవలసిన దశల వారీగా లక్ష్యాలను సాధించడానికి అవసరమైన ప్రణాళిక ప్రకారం అడుగులు వేయాలని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాధవీలత భూ సమగ్ర సర్వే ప్రక్రియ లో భాగంగా జిల్లాలో 269 రెవెన్యూ గ్రామ పంచాయతీల పరిధిలో 231 గ్రామాల్లో గ్రౌండ్ కంట్రోలింగ్ పాయింట్స్ (GCP) ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలిపారు. మిగిలిన 38 గ్రామాల్లో పురోగతిలో ఉన్నట్లు పేర్కొన్నారు . చెక్ పాయింట్స్ కి చెంది ఇప్పటి వరకూ 94 గ్రామాల్లో పనులు పూర్తి చేశామన్నారు. 160 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తి చేసినట్లు మాధవీ లత తెలియచేశారు.

గ్రౌండ్ ట్రూథింగ్ కి సంబంధించి రెండవ దశ 16 గ్రామాల్లో పనులు చేసే విధానం లో ఇప్పటి వరకు 12 గ్రామాల్లో పనులు పూర్తి చేశామని, 4 గ్రామాల్లో పురోగతిలో ఉన్నట్లు తెలియచేశారు. సర్వే రాళ్ళకు చెంది జిల్లాలోని  44 గ్రామాలకు 72485 సర్వే రాళ్ళు సరఫరా చేయాల్సి ఉండగా, 33,946 అందాయని అన్నారు. వాటిలో 26,273  సర్వే రాళ్ళు ఏర్పాటు చేసి నట్లు తెలియచేశారు.

భూ రికార్డుల ప్రక్షాళన కోసం జిల్లాలోని 272 గ్రామ పంచాయతీ లకు గాను 208 పనులు చేపట్టి 92 గ్రామాల్లో పూర్తి చేసినట్లు మాధవీలత తెలిపారు. 615003 రికార్డులకు గాను 391094 (63.59%) పూర్తి చేసినట్లు తెలిపారు. మూటేషన్ కి సంబందించిన 16102 రికార్డులను  సరిచేసినట్లు తెలియచేశారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జీ. నరసింహులు, ఆర్డీవో లు ఎస్. మల్లి బాబు, ఏ. చైత్ర వర్షిణి, ఏ డి సర్వే అధికారి పి. లక్ష్మణరావు, కలెక్టరేట్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *