-సైకిల్ తొక్కడం వల్ల కొవ్వు వేగంగా కరుగుతుంది..
-తద్వారా శరీర బరువును వేగంగా తగ్గించుకోవచ్చు.
-రోజూ కనీసం 30 నిమిషాల పాటు సైక్లింగ్ చేసే వారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువ.
-సైక్లింగ్ తో గుండె పదిలం
-కలెక్టర్ డా. కె. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజం లో మహిళా ఆరోగ్యంతోనే కుటుంబ సౌభాగ్యం ఏర్పడుతుందని కలెక్టర్ డా. కె.మాధవవీలత పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ పక్షోత్సవాలు సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మారథాన్ సైకిల్ ర్యాలీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత, వైద్యాధికారులతో కలసి జండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో నగరంలోని పాలు స్వంచ్చంద సంస్థలు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూమహిళలు దైనందిన జీవితంలో భాగంగా సైక్లింగ్ తప్పని సరిగా చేయాలన్నారు. ఇది ఏరోబిక్ వ్యాయామం కాబట్టి మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందన్నారు. గుండెకు ఆక్సిజన్ కలిగిన రక్తాన్ని సరఫరా చేయడానికి సైక్లింగ్ ఉపయోగపడుతుందన్నారు. తద్వారా ఇది వేగంగా పని చేస్తుందన్నారు. సైకిల్ తొక్కడం వల్ల మీ రక్తనాళాలు, ఊపిరితిత్తులు కూడా బాగా పని చేస్తాయని చెప్పారు. మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సైక్లింగ్ సహాయపడుతుందన్నారు. మహిళా సాధికారత సాధన దిశగా అడుగులు వేయాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కొరకు ప్రవేశపెట్టిన పథకాలపై అవగాహన కలిగివుండాలన్నారు.
డిఎంహెచ్ ఓ డా. కె. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 1 నుంది 8 వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమాలన్నింటిని రికార్డ్ చేసి పిసిపిఎన్డిటి ఆంధ్ర ఈస్ట్ గోదావరి ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేయటం జరుగుతుందని, అదేవిధంగా మహిళల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగినన్ని అవగాహన కార్యక్రమాలు జిల్లా అంతటా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు. సోమవారం స్కానింగ్ సెంటర్ లపై డెకొయ్ ఆపరేషన్ నిర్వహిస్తామని, అందుకు సంబందించి 22 మంది తో కూడిన ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారని, అదేవిధంగా ఐదుగురితో ప్రముఖులతో వీడియో క్లిప్పింగ్స్ మాట్లాడించి వాటిని ట్విట్టర్స్ లోనూ సోషల్ మీడియాలోనూ రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రణాళిక రూపొందించినట్లుగా తెలియపరిచారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ ఇంచార్జ్ డా.సుధాకర్, ఐఎంఏ ప్రెసిడెంట్ డా. గురు ప్రసాద్, డిఎన్ఎమ్ఓ డా. లక్ష్మీదేవి, డా.రాజీవ్,
ఎం హెచ్ ఓ డా. వినూత్న, ఎంపీహెచ్వో నాగు
డిప్యూటీ డెమో సత్య కుమార్, సుధీర్ డిపిఎమ్ఓలు, సత్యనారాయణ, వైద్యాధికారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.