స్పందన అర్జీలను తీసుకోవడం పై ప్రజల్లో అవగాహన కల్పించాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలు నుంచి స్పందన అర్జీలను తీసుకోవడం పై ప్రజల్లో అవగాహన కల్పించాలని, సోమవారం జిల్లా కలెక్టరేట్ లో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నామని  జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత  ఆదివారం ఒక ప్రకటన లో  తెలిపారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ లో ప్రజల నుంచి  స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు అర్జీలను స్వీకరించడం జరుగుతుందన్నారు. డివిజన్, మండల స్థాయి , గ్రామ సచివాలయాల్లో అధికారులు , సిబ్బంది అర్జీలు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా కలెక్టరేట్ నుంచి మండల స్థాయి లో జరిపే స్పందన కార్యక్రమాన్ని జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా పరిశీలించటం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. అన్ని మండలాల్లో, గ్రామ, వార్డ్ సచివాలయాల్లో యధావిధిగా స్పందన కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజల నుంచి అర్జీలను ఉదయం 10 నుంచి 1 గంట వరకు స్వీకరించడం జరుగుతుంది. రాజమహేంద్రవరం ఆర్టిసి బస్టాండ్ నుంచి కలెక్టరేట్ కు ఉచిత బస్సు సర్వీసు ఉదయం 9 గంటల నుంచి మ.1 గంట వరకు అందుబాటులో ఉంటుందనీ పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *