రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలు నుంచి స్పందన అర్జీలను తీసుకోవడం పై ప్రజల్లో అవగాహన కల్పించాలని, సోమవారం జిల్లా కలెక్టరేట్ లో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ లో ప్రజల నుంచి స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు అర్జీలను స్వీకరించడం జరుగుతుందన్నారు. డివిజన్, మండల స్థాయి , గ్రామ సచివాలయాల్లో అధికారులు , సిబ్బంది అర్జీలు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా కలెక్టరేట్ నుంచి మండల స్థాయి లో జరిపే స్పందన కార్యక్రమాన్ని జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా పరిశీలించటం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. అన్ని మండలాల్లో, గ్రామ, వార్డ్ సచివాలయాల్లో యధావిధిగా స్పందన కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజల నుంచి అర్జీలను ఉదయం 10 నుంచి 1 గంట వరకు స్వీకరించడం జరుగుతుంది. రాజమహేంద్రవరం ఆర్టిసి బస్టాండ్ నుంచి కలెక్టరేట్ కు ఉచిత బస్సు సర్వీసు ఉదయం 9 గంటల నుంచి మ.1 గంట వరకు అందుబాటులో ఉంటుందనీ పేర్కొన్నారు.
Tags rajamendri
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …