రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం క్రింద జిల్లా లో నిర్దేశించిన పని దినాలను కల్పించి ఆమేరకు ఉపాధి లక్ష్యాలను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత స్పష్టం చేశారు సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీ సీ హాల్ నుంచి గ్రామీణ ఉపాధి హామీ, వై ఎస్ ఆర్ పెన్షన్ కానుక, రబీ ధాన్యం కొనుగోలు, వ్యవసాయ యంత్ర సేవాపథకం , గ్రామ వార్డ్ సచివాలయాలు, స్పందన అర్జీలు పరిష్కారం, ఎపిక్ కార్డ్, 6బి ఫారం ఆధార్ అనుసంధానం వంటి అంశాలపై జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ డా. కే.మాధవిలత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం క్రింద జిల్లా లో 59 లక్షల పనిదినాలకు గాను 83.19 శాతం మేర లక్ష్యాలను పూర్తి చేశామన్నారు. మిగిలిన లక్ష్యాలపై కార్యాచరణ నిర్దేశించుకుని ప్రగతి సాధించాలని స్పష్టం చేశారు. జిల్లాలో సగటు వేతన రు. 221.01 అందించామన్నారు. లక్ష్యలు పూర్తి చేయడంలో వెనుకబడిన మండలాలు త్వరితగతిన ప్రగతి సాధించాలన్నారు.రానున్న నెలలో జిల్లాలో వై ఎస్ ఆర్ పెన్షన్ పంపిణీ 1 వ తేదీ ఉదయం 6 గంటలకే ప్రారంభించి సాయంత్రానికి పూర్తి చేసే విధంగా ఎంపిడిఓ లు, మున్సిపల్ కమీషనర్లు చర్యలు చేపట్టాలన్నారు. మార్చి నెలలో 236251 మందికి గాను 234125 మంది పెన్షనర్లకు పంపిణీ చేసి 9.09 శాతం పంపిణీ చేసామన్నారు.స్పందనలో వచ్చిన ప్రతి అర్జీ నాణ్యతతో కూడిన విధంగా పరిష్కరించి అర్జీదారుడు సంతృప్తి చెందే విధంగా పరిష్కార పత్రాన్ని అందజేయాలన్నారు. స్పందనలో పరిష్కరించిన అర్జీలను ప్రతి గురువారం పది అర్జీలను ర్యాండమ్ చెక్ చేస్తామన్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం స్పందన వెబ్సైట్ ఓపెన్ చేసి అర్జీలు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.జిల్లాలో వైయస్సార్ యంత్ర సేవా పథకం అమల్లో భాగంగా 273 సిహేచ్ సి గ్రూపులు లక్ష్యానికి గాను 146 గ్రూపులను ఎంపిక చేసిన బ్యాంకు ఖాతాలను ప్రారంభించారని, మిగిలిన గ్రూపులను కూడా ఆయా ఆర్ బి కే ఎల్ ద్వారా ఎంపిక చేయడంలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులతో సమావేశాలు నిర్వహించి లక్ష్య సాధన పూర్తి చేయాలన్నారు.జిల్లాలో రబీ పంటకు సంబంధించి రాజమహేంద్రవరం డివిజన్లో అనపర్తి, బిక్కవోలు, రంగంపేట మండలాల్లోనూ, కొవ్వూరు డివిజన్ సంబంధించి తాళ్లపూడి, చాగల్లు మండలాల్లోనూ ముందస్తుగా కోతలు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, గన్ని బ్యాగ్ ల అంచన వంటి అంశాలకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలన్నారు. ఇందుకు సంబంధించి డివిజనల్ రెవెన్యూ అధికారులు మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.ఓటర్ జాబితా 6బి ఆధార్ అనుసంధానం ప్రక్రియ లో భాగంగా జిల్లాలో 15,52,333 మంది ఓటర్లు కు గాను 12,05,701 కి ఆధార్ అనుసంధానం 77.67 శాతం చేయడం జరిగిందని మిగిలిన 22.33 శాతాన్ని కూడా మార్చి నెలాఖరకు పూర్తిచేయాలని ఆదేశించారు.వీడియో కాన్ఫరెన్స్ లో డీఆర్ఓ జి. నరశింహులు, జిల్లా వ్యవసాయాధికారి ఎస్ మాధవరావు, దోమ పిడి జి ఎస్ రామ్ గోపాల్, డిఆర్డిఏ పిడి సుభాషిని, డి ఎల్ డి ఓ వీణాదేవి, పిడి మహిళా అభివృద్ధి అధికారి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Tags rajamendri
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …