Breaking News

జిల్లా ఎన్నికల అధికారుల తో వీడియో కాన్ఫరెన్స్…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 13 వ తేదీన జరగనున్న పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని రెండు స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుల ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కొవ్వూరు డివిజన్ పరిధిలో ఓటింగ్ నిర్వహణ కోసం ఏర్పాట్లు పూర్తి చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎమ్ కె మీనా వెలగపూడి నుంచి ఎం ఎల్ సి ఎన్నికలు అంశానికి సంబంధించి జిల్లా ఎన్నికల అధికారుల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ, కొవ్వూరు డివిజన్ పరిధిలో 242 మంది తమ ఓటు హక్కును వినియోగించుకానున్నారని అన్నారు. ఇందులో 107 మంది పురుషులు, 135 మంది మహిళలు, 3 శాసన సభ్యులు వారి ఓటు హక్కు వినియోగించు కోవడానికి తగిన ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఇందులో భాగంగా స్థానిక సంస్థలకు చెందిన కొవ్వూరు మునిసిపాలిటీ లో 23 మంది, నిడదవోలు పురపాలక సంఘం పరిధిలో 28 మంది, జెడ్పిటిసి లు 9 మంది, ఎమ్.పీ.టి.సి. సభ్యులు 179 మంది, ముగ్గురు శాసన సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోగలరు నున్నట్లు తెలిపారు. ఎన్నికల పక్రియ కు సంబందించి పిఓలు, ఎపిఓలు, ఓపిఓలు, 9 ఎం సీ సీ బృందాలు, 9 ఎఫ్ఎస్టి బృందాలను నియమించా మన్నారు. ఈ నెల 13 వ తేదీన జరగనున్న ఎం ఎల్ సి ఎన్నికలు ఉదయం 8 గంటలు నుంచి సాయంత్రం 4 గంటలు వరకు పోలింగ్ కొవ్వూరు ఎంపిడివో కార్యాలయం సమావేశ మందిరంలో జరుగుతుందన్నారు. అందుకు సంబంధించి తగిన ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ మాధవీలత వివరించారు. ఈ సమావేశంలో డిఆర్వో జీ. నరసింహులు, ఎలక్షన్ సెక్షన్ సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి , ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *