న్యాయ విజ్ఞాన సదస్సు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ప్రత్యూష కుమారి … అంతర్జాతీయ మహిళావారోత్సవాల్లో భాగంగా స్థానిక నెహ్రూనగర్ మునిసిపల్ హై స్కూల్ నందు గురువారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యూష కుమారి బాలికలకు ప్రాథమిక హక్కులు, బాధ్యతల గురించి వివరించారు. భారత రాజ్యాంగంలోని అధికరణ 21(ఏ), ఉచిత మరియు నిర్బంధ విద్య హక్కు చట్టం, 2009 గురించి తెలిపారు. నేటి సమాజంలో మహిళల పట్ల, బాలికల పట్ల అనేక అఘాయిత్యాలు జరుగుతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితులలో మహిళలు ధైర్యంగా పోరాడాలి కానీ ఆత్మహత్యలకు పాల్పడకూడదని తెలియజేశారు. అలాంటి చర్యలకు పాల్పడటం వల్ల కన్నవారికి తీరని శోకం కలిగిస్తున్నారని వివరించారు. ఎవరు ఎలాంటి ఇబ్బంది కలిగించినా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. న్యాయ సేవాధికార సంస్థల చట్టం, 1987 ప్రకారం మహిళలు, పిల్లలు ఉచిత న్యాయ సేవలు పొందేందుకు అర్హులని తెలియజేశారు. ఆడపిల్లలు తిరుగులేని శక్తిగా ఎదగాలని, వారి సేవలు దేశానికి అందించాలని వారితో చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యయులు కె.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ క్రమశిక్షణతో, నిజాయితీగా జీవించడం వల్లనే గౌరవించబడతారని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా యుక్తితో వ్యవహరించాలని బాలికలతో చెప్పారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *