Breaking News

పాల‌న‌లో అనూహ్య సంస్క‌ర‌ణ‌లు తీసుకు వ‌చ్చాం

-రెవెన్యూ శాఖ‌లో అనూహ్య మార్పులు చేశాం. ఈనాం చ‌ట్టంలో స‌వ‌ర‌ణలు చేశాం
– పాల‌న సంస్క‌ర‌ణ‌ల కార‌ణంగా వెలువ‌డే ఫ‌లితాలు త్వ‌ర‌లోనే అంద‌రికీ అందుతాయి
– అవినీతి లేని పాల‌న‌తో దేశంలోనే అగ్ర భాగాన ఆంధ్ర‌ప్రదేశ్
– లంచ‌గొండుల‌కు తావు లేని విధంగా పాల‌న
– పేద‌లంతా స‌మాజంలో ఉన్నత రీతిలో బ‌తికే విధంగా చేసిన ప్ర‌భుత్వం ఇది
– బలహీనుడు తన ఆస్తిని సులువుగా రుజువు చేసుకునే పరిస్థితులు కల్పిస్తున్నాం.
– రాజ్యాంగానుసార‌మే పాల‌న. నిధుల వెచ్చింపులో కూడా పార‌దర్శ‌క‌త
– పాద‌యాత్ర‌లో ఇచ్చిన హామీల అమ‌లుకు కృషి నాడు చెప్పిన ప్ర‌తి మాట‌నూ నెర‌వేర్చిన సీఎం
– ప్రజల కోసం తండ్రిలానే ఆలోచించే వ్య‌క్తిత్వం ఉన్న నేత జ‌గ‌న్. విశ్వసనీయత కలిగిన నాయకుడు జ‌గ‌న్
– స్వాతంత్ర్యం వ‌చ్చిన ఇన్నేళ్ల‌లో ఎన్న‌డూ లేని విధంగా స‌ర్వే
– స‌ర్వే కార‌ణంగా క్లియ‌ర్ టైటిల్ పొందేందుకు ఆస్కారం
– వివిధ ప‌థ‌కాల ద్వారా రూ.2.7 లక్షల కోట్ల వెచ్చించాం. ఇంత మొత్తాన్ని నేరుగా ల‌బ్ధి దారుల ఖాతాల‌కు అందించాము.
-గోపాల‌పురంలో కోటీ యాభై ల‌క్ష‌ల రూపాయ‌ల‌ వ్య‌యంతో రైతు భ‌రోసా కేంద్రం, గ్రామ స‌చివాల‌యం, త‌హ‌శీల్దార్ కార్యాల‌యంఏర్పాటు
-రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖామాత్యులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు

గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడ లేని విధంగా గత నాలుగేళ్లలో అర్హతే ప్రామాణికంగా రాష్ట్రంలో రు. 2 లక్షల 7 వేలకోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకు అందించారని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఆదివారం గోపాలపురం మండలం గోపాలపురం లో రు.కోటి 51 లక్షల 80 వేల రూపాయలతో వ్యయంతో నూతనం గా నిర్మించిన తహసీల్దార్ కార్యక్రమం, రైతు భరోసా, గ్రామ సచివాలయం ను ప్రారంభించిన రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, జిల్లా ఇంఛార్జి మంత్రి సమాచార పౌరసంబంధాలు, సినీమాటోగ్రపీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎంపీ మార్గాని భరత్ రామ్, జిల్లా కలక్టర్ డా. కే.మాధవీలత, శాసన సభ్యులు తలారి వెంకట్రావు , జక్కంపూడి రాజా తొ కలసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా గ్రామ సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన సభలో మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ రాజ్యాంగ బద్ధంగా పరిపాలన వికేంద్రికరణ చేసి గత నాలుగేళ్లగా ఆంక్షలు లేని విధంగా నిష్పక్ష పాతంగా పాలన చేస్తూ ప్రజల్లో ఆత్మ విశ్వాసాన్ని ప్రభుత్వం మరింత పెంచిందన్నారు. గతంలో ప్రజలు సంక్షేమ ఫలాలను అందుకోవలంటే భయపడుతూ ఆత్మన్యూన్యతా భావనతో జీవించేవారన్నారు. నేడు ఈ ప్రభుత్వం ప్రజల్లో భయాలను తొలగించి నేరుగా అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అందించడం చూసి ఈ పద్దతులను అంగీకరిస్తున్నారన్నారు. మాట ఇచ్చి అది నిలబెట్టుకునే బాధ్యత ప్రతి రాజకీయ పార్టీకీ ఉండాలన్నారు. ప్రజలకు స్వేచ్చగా ప్రభుత్వాలను ఎన్నుకునే హక్కు ఉందన్నారను. అవినీతి రహిత దిశగా ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి పాలనను సాగిస్తున్నారన్నారు. కొన్ని పనులు ఆలస్యమైనప్పటికీ అన్ని అంశాలను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో చేస్తున్నామన్నారు. ప్రధాన మంత్రి, ఒక సందర్భంలో..గ్రామీణ ప్రాంతాల వారి కోసం వెచ్చించే డబ్బు 90 శాతం మధ్యవర్తులకు, లంచాలకు వెళ్ళిపోతుందని బహిరంగంగానే ఆవేద‌న చెందారు. రాష్ట్రంలో నేడు, సుమారు. రూ.2.7 లక్షల కోట్లు డీబీటీ ద్వారా అందించాము. అందుకు గాను ఎక్కడైనా పైసా లంచం తీసుకున్న, ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ మార్పును ప్ర‌జ‌లంతా గ‌మ‌నించాలి. స్వాతంత్ర్యం వ‌చ్చిన ఎన‌భై ఏళ్ల‌లో ఎన్న‌డూ చేయని విధంగా సంస్క‌ర‌ణలు తీసుకు వ‌చ్చాం. ఇది మ‌రింత కాలం త‌రువాత వీటి ఫ‌లాలు మీకు అర్థం అవుతాయి. ఒక వ్య‌క్తి ఒక వ్య‌క్తిని క‌లిస్తే కానీ ప‌ని అవ్వ‌దు అన్న విధానానికి చెక్ పెడుతూ పాల‌న ప‌రంగా సంస్క‌ర‌ణ‌లు వేగవంతం చేస్తూ ఉన్నాం.

రెవెన్యూ శాఖలో అనేక సంస్కరణలు తెస్తున్నామన్నారు. వందేళ్లుక్రితం జరిగిన సర్వేను గత ప్రభుత్వాలు పట్టించుకోనప్పటికీ నేడు ముఖ్యమంత్రి సహసోపేతంగా చేపట్టారు. ఇప్పటికే 2 వేల గ్రామాల్లో రీసర్వే ప్రక్రియ పూర్తయ్యిందన్నారు. మే మాసం నాటికి డ్రోన్ సర్వే ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. సర్వే పూర్తి అయితే ఏవరి ఆస్థి మీద వారికి పూర్తి అవగాహన ఉంటుందని తద్వారా బ్యాంకు రుణాలు, ఉపాధి లభ్యత చేకూరుతుందని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన 80 ఏళ్ళ తరువాత రెవెన్యూ విభాగంలో అనే సంస్కరణలు చేపట్టి నూతన సాంకేతికతతో విధానాలను అమలు చేస్తున్నామన్నారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీలకు వారి ఆర్థికాభివృద్ది కొరకు భూములను అందించాం. ప్రభుత్వం భూములను గత 20 ఏళ్ళుగా సాగుచేస్తున్న రైతులకు వారి అర్హతను గుర్తించి అందించేందుకు క్యాబినెట్ ఆమోదం అనంతరం చర్యలు తీసుకోవడం జరగుతుందన్నారు. రిజిస్ట్రేషన్ కొరకు దూర ప్రాంతాలకు వెళ్ళకుండా గ్రామంలోనే రిజిస్ట్రేషన్ చేయించుకునే విధగా సబ్ రిజిష్ట్రార్ కార్యాలయ సౌకర్యం కల్పించామన్నారు. రెండేసి రిజిస్ట్రేష‌న్ల‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండా చ‌ర్య‌లు చేప‌డుతున్నాం. బ‌ల‌హీనుడు త‌న ఆస్తిని సులువుగా రుజువు చేసుకునే ప‌రిస్థితులు క‌ల్పిస్తున్నాం. డబుల్ రిజిస్ట్రేష‌న్ల‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండా సిస్‌ామ్ లో మార్పులు తీసుకు వ‌చ్చామని మంత్రి ధర్మాన పేర్కొన్నారు. నేడు ఈ పర్యటనలో మీరందరు నాపట్ల చూపిన ఆప్యాయతగా ఆదరాభిమానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు.

జిల్లా ఇంఛార్జి మంత్రి సమాచార పౌరసంబంధాలు, సినీమాటోగ్రపీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో సంక్షేమ మే లక్ష్యంగా అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను నేరుగా వారికి ఇంటి వద్దకే అందిస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటరీ, సచివాలయ వ్యవస్థను ప్రవేశ పెట్టి నేరుగా సంక్షేమ పథకాలను ప్రజల ఇంటివద్దకే ప్రభుత్వం అందిస్తుందన్నారు.
జిల్లా కలెక్టరకు డా. కే. మాధవీలత మాట్లాడుతూ ప్రభుత్వం పథకాలు ప్రయోజనాలను అర్హులైన వారందరికీ జవాబుదారీ తనంతో అందిస్తున్నామన్నారు. నేడు గోపాలపురం నియోజకవర్గంలో రు. కోటి 51 లక్షల 80 వేలరూపాయలతో తాహశీల్థారు కార్యాలయం, అర్బీకే, గ్రామ సచివాలయాన్ని నిర్మించి నేడు మంత్రుల చేతుల మీదు ప్రారంభించుకుంటున్నామన్నారు.

ఎంపీ మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రయోజనాలను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం కుల మత రాజకీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా అందిస్తుందన్నారు. రైతు సంక్షేమే లక్ష్యంగా వారికి ఆర్థిక భరోసాను కల్పిస్తూ చేయూతనందిస్తుందన్నారు.

స్థానిక శాసనసభ్యులు తలారి వెంకట్రావు మాట్లాడుతూ దేశానికి వెన్నెముకైన రైతుకు భరోసాను అందిస్తూ నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నారన్నారు. నియోజకవర్గంలో గత ఎస్సీ, ఎస్టీలకు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో భూములను పంపిణీ చేసారన్నారు. నియోజక వర్గంలో గత 20 ఏళ్ళుగా పెండింగ్ లో ఉన్న రహదారి అభివృద్ది పనులు శరవేగంగా జరగుతున్నాయని పేర్కొన్నారు. గతంలో వ్యవసాయ రంగానికి సంబందించి భూసార పరీక్షలు కొరకు దూర ప్రాతాలకు వెళ్లే పరిస్థితి ఉండేది నేడు గ్రామాల్లోనే ఆర్బీకేలు ద్వారా అందుబాటులో కి ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. నియోజకవర్గంలోని 81 గ్రామ పంచాయితీల్లో సచివాలయాలు చాలా వరకు ప్రారంభించుకున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ మార్గాని భరత్ రామ్, జిల్లా కలక్టర్ డా. కే.మాధవీలత, శాసన సభ్యులు తలారి వెంకట్రావు , జక్కంపూడి రాజా, స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *