Breaking News

దరఖాస్తు చేసిన 90 రోజుల్లో అర్హులైన వారందరికీ ఇళ్ల పట్టాలు

దేవరపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
దరఖాస్తు చేసిన 90 రోజుల్లో అర్హులైన వారందరికీ ఇళ్ల పట్టాలు అందిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అర్హులకు సంక్షేమ పథకాలను అమలు చేయడంలో అర్హతే ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, జిల్లా ఇంఛార్జి మంత్రి సిహెచ్. శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ లు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం స్థానిక గోపాలపురం నియోజక వర్గం పరిధిలోని దేవరపల్లి లో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రెవెన్యూ శాఖ మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సిహెచ్. శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ లు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయడం లో కులాలు, ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా పరిపాలన అందించడం జరుగుతోందని అన్నారు. స్థానిక శాసన సభ్యులు తలారి వెంకట్రావు మాట్లాడుతూ, గతంలో ఏదైనా సంక్షేమ పథకాలను అమలు చేస్తే నిర్ణీత సమయం లో ధరకాస్తు చేసుకున్న వారిలో లక్ష్యాలను నిర్దేశించి వారికి మాత్రమే లబ్ది చేకుర్చేవారన్నారు. జగనన్న ప్రభుత్వం అర్హులకు అన్ని పథకాల ప్రయోజనం కల్పించేందుకు ధరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఇవ్వడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం ఆదిశలో భాగంగా నేడు దేవరపల్లి లో ఇంటి స్థలాలు కోసం ధరఖాస్తు చేసుకున్న 50 మంది లబ్ధిదారులకు 90 రోజుల్లో ఇంటి స్థలాలు పట్టాలు అందచేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో ఎంపి మార్గని భరత్ రామ్, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, ఆర్డీవో ఎస్. మల్లిబాబు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *