Breaking News

రబీ సాగు పంట దిగుబడి ప్రతి ధాన్యం గింజను రైతు నుంచి కొనుగోలు చేయాలి

-అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేయాలి
-ఏప్రిల్ 14 నుంచి జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రారంభం
– జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రైతుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు సమన్వయంతో పూర్తి పారదర్శకంగా, జవాబుదారి తనంతో ధాన్యం సేకరణ సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత పేర్కొన్నారు.

మంగళవారం ఉదయం జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ తో కలిసి కలెక్టరు మాధవీలత నామవరం అర్భికే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ, ప్రస్తుత రబీ సీజన్ లో ధాన్యం కొనుగోలు చేసే విధానం అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. రైతులకు మద్దతు ధర అందచేసే క్రమంలో అధికారులు పూర్తి సమన్వయంతో పని చేసి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. జిల్లాలో వరి సాగు చేసే ప్రాంతాల పరిధిలో ఉన్న ఆర్భికే లలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చెయ్యడం జరిగిందన్నారు. ఆయా కేంద్రాలలో తగిన సిబ్బంది, తేమ శాతం తెలుసుకునే పరికరాలు ఇతర సామగ్రి అందుబాటులో ఉంచామన్నారు. విఏఓ, విఆర్వో, సహకార సిబ్బంది అందుబాటులో ఉంచి కొనుగోలు చేపట్టడం జరుగుతోందని అన్నారు. పూర్తి పారదర్శకంగా, జవాబుదారి తనంతో ధాన్యం సేకరణ చేపట్టాలని స్పష్టం చేశారు. ధాన్యంలో తేమ శాతం విషయం తగిన చర్యలు తీసుకోవాలని, ప్రస్తుత రబీ సీజన్ లో తేమ శాతం 17 శాతం మించి ఉండే అవకాశం లేదన్నారు. మిల్లర్లు కొనుగోలు సమయంలో నూకలు ఉన్నాయని, విరిగి పోయాయని ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చెయ్యరాదని మిల్లర్లకు స్పష్టం చేశామన్నారు. అధికారులు మిల్లర్ల మధ్య సమన్వయం సాధించడం ముఖ్యం అని కలెక్టర్ మాధవీలత అన్నారు. రైతు కళ్లాల నుంచి మిల్లర్లు చేరిన ధాన్యాన్ని వెను వెంటనే దిగుమతి చేసుకోవాలన్నారు. గన్నీ బ్యాగ్స్, ట్రాన్స్ పోర్టు అంశాలకు సంబందించి ముందస్తు కార్యాచరణతో ఉండాలన్నారు.

రైతు కళ్లెంలో ధాన్యం కోసి ఉండకుండా ఎప్పటి కప్పుడు కొనుగోలు చేసే విధానం షెడ్యూలింగ్ చేసి రైతులకు భరోసా ఇచ్చే క్రమంలో మిల్లర్ల కు స్పష్టం చేశామన్నారు. ఇప్పటి వరకూ 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కోతలు ప్రారంభం అయ్యాయని, అన్ని కొనుగోలు కేంద్రాలను సిద్దం చెయ్యడం జరిగిందన్నారు. జిల్లాలో సజావుగా ధాన్యం సేకరణ కోసం ప్రతి రోజు జాయింట్ కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి క్షేత్ర స్థాయి అధికారులను అప్రమత్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ తనిఖీ లో తేమ శాతం పరిశీలన చేశారు. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, ఆర్డీవో ఎ. చైత్ర వర్షిణి, జిల్లా అగ్రి ఎడ్వజరీ బోర్డు మెంబరు కంటే తేజ్,ఇతర అర్భికే సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *