-దోమల నియంత్రణకు ఇంట, బయట నీరు నిలువ లేకుండా పరిశరాల శుభ్రతను పాటిద్దాం..
-జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత
రాజమహేంధ్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాను మలేరియా రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ దోమల నియంత్రణకు ఇంట, బయట నీరు నిలువ లేకుండా పరిశుభ్రతను పాటించాలని జిల్లా కలెక్టరు డా. కే.మాధవీలత పిలుపునిచ్చారు.
ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా దోమలనివారణ, పరిశుభ్రతపై అవగాహన కొరకు మంగళవారం స్థానిక వై. జంక్షన్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు నిర్వహిస్తున్న ర్యాలీకి జిల్లా కలెక్టరు మాధవీలత, డిఎంహెచ్ ఓ డా. కెం. వెంకటేశ్వరారవు, వైద్యాధికారులతో కలసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టరు మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో ప్రతి ఒక్కరూ పరిశరాల పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ ఇంట బయట నీరు నిలవలేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం వలన దోమలు ప్రభలకుండా అరికట్టగలమన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడేగా ప్రకటించి పరిశుభ్రత కొరకు మెరుగైన శానిటేషన్ పాటిస్తున్నామన్నారు. అదేవిధంగా జిల్లాలో నగరపాలక, పురపాలక, గ్రామ పంచాయితీల పరిధిలో దోమల నివారణ కొరకు పూర్తి స్థాయిలో శానిటేషన్ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. జిల్లాలోని ప్రజలందరు ముందుకొచ్చి మలేరియాకు కారణమైన దోమల నియంత్రణకు ఇంటిలోను, ఇంటి బయట ఎక్కడా నీరు నిలువ ఉండకుండా తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. శానిటేషన్ తోనే ఆరోగ్య పరిస్థితులు ముడిపడి ఉన్నందున పారిశుద్ద్యానికి అత్యంత ప్రాధాన్యతనివ్వడం వలన ఎటువంటి వ్యాధులు ప్రభల కుండా ఉంటాయని పేర్కొన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురష్కరించుకొని ప్రతి ఒక్కరూ దోమల నియంత్రణకు పరిశరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు.
ర్యాలీ కార్యక్రమంలో డిఎంహెచ్ ఓ డా. కె. వెంకటేశ్వరరావు, డిఎల్ ఎం ఏ అధికారిణి డా. ఎన్. వసుంధర, వైధ్యులు, వైద్య సిబ్బంది. ఏఎన్ ఎం తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News