Breaking News

“ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం మధ్యవర్తిత్వం మరియు సంస్థకు ముందు మధ్యవర్తిత్వం”

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
, బుధవారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు “ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం మధ్యవర్తిత్వం మరియు సంస్థకు ముందు మధ్యవర్తిత్వం” ( “ADR(Alternative Dispute Resolution), Mediation మరియు Pre-institution Mediation” ) పద్ధతులపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి కె. ప్రత్యూష కుమారి మాట్లాడుతూ మధ్యవర్తిత్వం యొక్క ప్రాముఖ్యతను గురించి వివరించారు. రాజీ పడదగిన కేసుల్లో ఇరు పక్షాలకూ సానుకూల వాతావరణంలో నైపుణ్యం కలిగిన మధ్యవర్తి (న్యాయవాది) సమక్షంలో వారి న్యాయ సమస్యలు పరిష్కరించుకోవచ్చని తెలియజేశారు. న్యాయవాది/శిక్షణ పొందిన మధ్యవర్తి పి. శ్రీనివాస రావు ఆర్బిట్రేషన్ అండ్ కన్సీలియేషన్ యాక్ట్, 1996 పై అవగాహన కల్పించారు. న్యాయవాది జి. కృష్ణ కపూర్ ప్రీ-ఇన్స్టిట్యూషన్ మీడియేషన్ అండ్ సెటిల్మెంట్ రూల్స్, 2018 పై అవగాహన కల్పించారు. ఈ సదస్సులో రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు జి. వి. వి. రాజు , న్యాయవాది/శిక్షణ పొందిన మధ్యవర్తి శ్రీమతి. కె. భాగ్యలక్ష్మి , న్యాయవాదులు, లా విద్యార్ధులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *