-జిల్లా కలెక్టరు డా. కే. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో జగనన్న వసతి దీవెన కింద 2022-23 సంవత్సరానికి గాను 32,078 విద్యార్థులకు చెందిన 28,769 మంది తల్లుల బ్యాంకు ఖాతాలకు రు.30.58 కోట్లు జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు.
జగనన్న వసతి దీవేన రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం అనంతపురం జిల్లా నార్పల గ్రామం నుంచి ప్రారంభించిగా… స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీ లత, రూడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిల రెడ్డి, అధికారులతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా.కే.మాధవీలత మాట్లాడుతూ చదువుకు పేదరికం అడ్డురాకూడదనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన విద్యార్థులందరికీ అందిస్తున్న విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి వంటి పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థుల భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించేవారికి రూ.20 వేల చొప్పున ప్రభుత్వం అందిస్తోందన్నారు. జిల్లాలో జగనన్న వసతి దీవెన కింద 32,078 విద్యార్థులకు చెందిన 28,769 మంది తల్లుల బ్యాంకు ఖాతాలకు రు.30.58 కోట్లు జమ చేయడం జరిగిందని కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు.
రూడా చైరపర్సన్ మేడపాటి షర్మిళారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఉన్నత విద్యను ప్రోత్సహిస్తు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఆర్థిక సాయం సహాయాన్ని అందిస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేడు 9,55,662 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 912.71 కోట్లు సీయం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాలకు జమ చేసారన్నారు.
జిల్లాలో నియోజకవర్గాల వారీగా…
అనపర్తి నియోజకవర్గం లో 3404 మంది విద్యార్థులకు చెందిన 3051 మంది తల్లుల ఖాతాలకు రు. 3.24 కోట్లు,రాజనగరం నియోజకవర్గం లో 4017 మంది విద్యార్థులకు చెందిన 3635 మంది తల్లుల ఖాతాలకు రు. 3.82 కోట్లు,రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం లో 5008 మంది విద్యార్థులకు చెందిన 4486 మంది తల్లుల ఖాతాలకు రు. 4.70 కోట్లు, రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గం లో 6045 మంది విద్యార్థులకు చెందిన 5445 మంది తల్లుల ఖాతాలకు రు. 5.79 కోట్లు, గోపాలపురం నియోజకవర్గం లో 3642 మంది విద్యార్థులకు చెందిన 3261 మంది తల్లుల ఖాతాలకు రు. 3.50 కోట్లు, కొవ్వూరు నియోజకవర్గం లో 4129 మంది విద్యార్థులకు చెందిన 3681 మంది తల్లుల ఖాతాలకు రు. 3.94 కోట్లు, నిడదవోలు నియోజకవర్గం లో 4998 మంది విద్యార్థులకు చెందిన 4436 మంది తల్లుల ఖాతాలకు రు. 4.77 కోట్లు, జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో 776 మంది విద్యార్థులకు చెందిన 772 మంది తల్లుల ఖాతాలకు రు. 0.74 కోట్లు, రంపచోడవరం నియోజకవర్గం (ఎస్టీ )గోకవరం మండలం లో 59 మంది విద్యార్థులకు చెందిన 52 మంది తల్లుల ఖాతాలకు రు. 0.05 కోట్లు, మొత్తం 32,078 విద్యార్థులకు చెందిన 28,769 మంది తల్లుల బ్యాంకు ఖాతాలకు రు.30.58 కోట్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేరుగా బటన్ నొక్కి జమ చేయడం జరిగింది.
జిల్లా వ్యాప్తంగా ఉన్న కులాలు వారీగా..
ఎస్సీ లకుగాను 6,265 మంది విద్యార్థుల 5,674 తల్లుల ఖాతాకు రు.5.93 కోట్లు, ఎస్టీలకు చెందిన 157 మంది విద్యార్థులకు చెందిన 147 మంది తల్లుల ఖాతాకు రు.14 లక్షలు, వెనుకబడిన తరగతులకు చెందిన 14,108 మంది కి చెందిన 12,617 మంది తల్లుల ఖాతాకు రూ.13.40 కోట్లు, ఆర్థికంగా వెనుకబడిన కులాల కు చెందిన 3,924 మంది విద్యార్థులకు చెందిన 3,610 మంది తల్లుల ఖాతాకు రూ 3.84 కోట్లు, ముస్లిం మైనారిటీ కి చెందిన 661 మంది విద్యార్థులకు చెందిన 591 మంది తల్లుల ఖాతాకు రూ. 63 లక్షలు, కాపు కులాలకు చెందిన 6,787 మంది విద్యార్థులకు చెందిన 6,058 తల్లుల ఖాతాకు రూ. 6.45 కోట్లు, క్రైస్తవ మైనారిటీ కి చెందిన 176 మంది విద్యార్థులకు చెందిన 156 మంది తల్లుల బ్యాంకు ఖాతాకు రూ. 17 లక్షలు జమ చేయడం జరుగుతున్నట్లు తెలిపారు.
విద్యార్థి గుమ్మడి భవాని
రాజమహేంద్రవరం అర్బన్ రామదాసు పేటకు నివాసి గుమ్మడి భవాని తన అభిప్రాయాన్ని తెలుపుతూ నేను రాజమండ్రి మహిళా కళాశాల లో రెండవ ఏడాది బీఎస్సీ చదువు తున్నాను. మా నాన్న వ్యాన్ డ్రైవర్ గా పని చేస్తున్నారు. మాది పేద కుటుంబం, మా కుటుంబం అంతా మానాన్న సంపాదనమీదనే ఆదార పడాలి. ఇటువంటి పరిస్థితిలో నేను ఉన్నత చదువు చదవాలంటే అది జరగదు. కానీ నేడు ముఖ్యమంత్రి జగనన్న అందిస్తున్న జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పధకంతో అది సాధ్యమైనదన్నారు. అదేవిధంగా మా కుటుంబంలో మానాన్నకు వాహన మిత్ర, అమ్మకు డ్వాక్రా రుణాలు, చెల్లికి అమ్మఒడి వంటి పథకాలు అందిస్తూ మా కుటుంబం ఆర్థికంగా బలో పేతం అయ్యేందుకు జగన్న ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తుందని భవాని సంతోషాన్ని వ్యక్తం చేశారు.
విద్యార్థి వంగా గాయత్రి
రాజమండ్రి ఉమెన్స్ కళాశాల లో బి. ఎస్. సి. రెండవ ఏడాది చదువుతున్న విద్యార్థిని వంగా గాయత్రి తన అభిప్రాయాన్నితెలుపుతూ జగనన్న వచ్చిన తరువాత విద్యకు అత్యంత ప్రాధాన్యతను కల్పిస్తూ నాడు- నేడు ఆధుణీకరించడంతో పాటు పేద విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యశించేందుకు చక్కని అవకాశాన్ని కల్పిస్తున్న ముఖ్యమంత్రి జగనన్నకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాన్నారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల వారి ఆర్థిక అభ్యున్నతికి సంక్షేమ పథకాలను అందించడం శుభ పరిణామం అన్నారు.
విద్యార్థి కడవటి తేజస్వి
నాపేరు కడవటి తేజస్వి నేను రాజమండ్రి మహిళా కళాశాలలో 2వ ఏడాది బీఎస్సీ చదువుతున్నాను. పేదరికంలో ఉన్న మా తల్లి తండ్రులు పై ఎటువంటి భారం పడకుండా జగనన్న వసతి దీవెన పధకం ద్వారా నాకు లబ్ధి చేకూరడం వల్ల నేను బాగా చదువు కోగలుగుతున్నాను. నాన్నలేక పోవడంతో అమ్మమ్మ వద్దనే ఉండి చదువుతున్నాను. విద్యార్థులకొరకు జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు నాకు ఎంతోగానో ఉపయోగపడుతున్నాయని తేజస్విఆనంతం వ్యక్తం చేసారు.
కార్యక్రమంలో రూడా చైర్ పర్శన్ మేడపాటి షర్మిలారెడ్డి, జిల్లా గిరిజన్ సంక్షేమాధికారి జ్యోతి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖాధికారి సందీప్, సూపరింటెండేంట్ యం.బాబీ, విద్యార్థులు తల్లితండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News