-నగరం లో పలు నిర్మాణాలు ఆకస్మిక తనిఖీ.
-కమిషనర్ దినేష్ కుమార్..
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ కె దినేష్ కుమార్ నగరం లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై నియంత్రణ లేకపోవడం పై బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. మహావీర్ స్ట్రీట్, మెరక వీధి,ఇన్నీస్ పేట, గైయిల్ ఆఫీస్ వద్ద జరుగుతున్న అక్రమ నిర్మాణాలను ఈ ఉదయం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న కట్టడాలను తక్షణమే కూల్చివేయాలని టౌన్ ప్లానింగ్ అధికారుల ను ఆదేశించారు. నగరపాలక సంస్థ అనుమతినిచ్చిన ప్లాన్ ప్రకారం మాత్రమే నిర్మాణాలు జరిగేలా సిబ్బంది, అధికారులు పర్యవేక్షణ చెయ్యాలని స్పష్టం చేశారు. ప్లాన్ కు తగ్గట్టుగా లేని అక్రమ కట్టడాలను తక్షణం కూల్చి వేయడమే కాకుండా, సంబంధిత భవన యజమాని పై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ పర్యటన లో నగరపాలక సంస్థ సిటీ ప్లానర్ జే. సూరజ్ కుమార్,ఇతర అధికారులు పాల్గొన్నారు.