రెడ్ క్రాస్ సొసైటీ కి రూ.3 లక్షలు విరాళాలు అందించిన బి.తాతారావును అభినందించిన కలెక్టర్

-సమాజ సేవలో రెడ్ సేవలు ఆదర్శం
-కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలు ప్రతి ఒక్కరూ తమ స్థాయి కి తగిన విధంగా సమాజ సేవలో భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పిలుపు నిచ్చారు. బుధవారం సాయంత్రం వెంకటేశ్వరట్రావెల్స్ అధినేత, బీమా జూవలరీస్ బిల్డింగ్ యజమాని బి.తాతారావు కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టర్ మాధవీలతను కలసి తన వంతు సహాయంగా జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ కి రూ.3 లక్షల రూపాల విరాళం చెక్కు ను అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ రాజమండ్రికి చెందిన బి. తాతారావు రూ.3/- లక్షల రూపాయలను అందించి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. తమ వంతు సామాజిక బాధ్యత గా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా విరాళాలు అందించాలని కోరారు. రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు. వాటిని సమర్థవంతంగా చేపట్టడంలో ప్రజల సహకారం అవసరం ఎంతైనా ఉందన్నారు. వీరిని ఆదర్శంగా తీసుకొని రెడాక్రాస్ అభివృద్దికి మరింత మంది ముందుకు రావాలని కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *