తాడేపల్లిగూడెం, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని యానాదులు కాలనీకి మహర్దశ పట్టింది నిన్నటి వరకు పూరి గుడిసెల్లో ఉన్న వారి జీవితాలు నేడు పక్కా బిల్డింగుల్లోకి మారబోతున్నాయి. ఇదంతా స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సంకల్పంతో సాకారం అయింది. ఆ యానాదుల కుటుంబాలు కలలో కూడా ఊహించని విధంగా పక్కా బిల్డింగులు వారి సొంతం కాబోతున్నాయి. బుధవారం సాయంత్రం స్థానిక కడకట్ల ప్రాంతంలోని యానాదుల కాలనీ కి సమీపంలో సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ సిమెంట్ కాంక్రీట్ పనులు ప్రారంభించే నిమిత్తం డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఆ ప్రాంతానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన సమీపంలో ఉన్న యానాదుల కాలనీని సందర్శించారు. అక్కడ యానాదుల కుటుంబాల కోసం నిర్మాణం పూర్తి చేసుకున్న పక్కా బిల్డింగులను పరిశీలించారు. ఆ ప్రాంతంలో రోడ్డుకు ఒకవైపు యానాదుల కుటుంబాలు ప్రస్తుతం నివసిస్తున్న పూరి గుడిసెలు మరోవైపు రేపు వారి కోసం సిద్ధం కాబోతున్న పక్కా బిల్డింగులు ఉన్నాయి. మంత్రి కొట్టు వాటిని చూపిస్తూ తమ ప్రభుత్వం లో నాడు నేడు గొప్పతనం ఇది అని అభివర్ణించారు. యానాదులు కలలో కూడా ఊహించని విధంగా వారికోసం బిల్డింగులు అన్ని వసతులతో సిద్ధమవుతున్నాయన్నారు. వారు జీవితంలో కూడా అటువంటి బిల్డింగులు కట్టుకుంటామని కలలో కూడా ఊహించి ఉండరన్నారు. అలాంటివారికి పక్కా బిల్డింగులు నిర్మించి ఇస్తున్న ఘనత వైకాపా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. యానాదుల కుటుంబాలకు మెరుగైన జీవితాన్ని అందించాలనే సంకల్పంతో ఒక బాధ్యత కలిగిన ప్రజా ప్రతినిధిగా తాను ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ప్రతి ఇంటికి ఉచిత కరెంటు మంచినీరు సదుపాయంతో పాటు రోడ్డు డ్రైనేజీ నిర్మాణం వీధిలైట్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ ప్రాంతంలో ఎంతో కాలంగా 27 యానాదుల కుటుంబాలు పూరి గుడిసెలు వేసుకుని స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాయన్నారు. సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం నేపథ్యంలో యానాదులకు శాశ్వత ప్రాతిపదికన స్థిర నివాసాల కోసం పక్కా బిల్డింగులు నిర్మించి ఇస్తున్నామని చెప్పారు. తాను ఏ కార్యక్రమం చేపట్టిన ఎవరికి ఇబ్బంది కలిగించకూడదని ఉద్దేశంతోనే ఉంటానన్నారు. అందులో భాగంగానే యానాదుల కుటుంబాలకు పక్కా బిల్డింగులు నిర్మించి ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ ఎస్ ఇ అంబటి సుధాకర్, హౌసింగ్ డీఈ కె వి వి ఎస్ ప్రసాద్, మున్సిపల్ ఈ ఈ డి మురళీకృష్ణ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కర్రి భాస్కర్ రావు, వైకాపా నాయకులు కొట్టు విశాల్, ముప్పిడి సంపత్ కుమార్ కొలుకులూరి ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News