Breaking News

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత
-డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి
-డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి ప్రవర్తన, వాహన నిర్వహణపై అవగాహన కలిగి ఉండాలి
-జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
పాఠశాల విద్యార్థులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చడంలో పాఠశాల బస్సు డ్రైవర్ల పాత్ర అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ డ్రైవర్లు నిబద్ధతతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. విజయవాడ బెంజ్ సర్కిల్‌లోని లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్‌లో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో బుధవారం పాఠశాల బస్సు డ్రైవర్లకు డ్రైవింగ్ మెళకువలు, రహదారి భద్రత, విద్యార్థుల సురక్షిత ప్రయాణం తదితర అంశాలపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ పాఠశాల బస్సు డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలని తెలిపారు. యూనిఫామ్‌లో ఉన్న డ్రైవర్లను చూడటం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు భద్రతపై మరింత నమ్మకం, భరోసా కలుగుతుందని అన్నారు. పాఠశాల బస్సుల్లో ప్రయాణించే విద్యార్థుల భద్రత ప్రధానంగా డ్రైవర్ల బాధ్యతపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఈ బాధ్యతను ప్రతి డ్రైవర్ అత్యంత జాగ్రత్తగా, నిబద్ధతతో నిర్వర్తించాలని సూచించారు. డ్రైవర్లు కేవలం డ్రైవింగ్‌లో నైపుణ్యం కలిగి ఉండటం మాత్రమే కాకుండా సహనం, సమయపాలన, మంచి ప్రవర్తన, బాధ్యతాయుత వైఖరి, వాహన నిర్వహణపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థులను తీసుకెళ్లే సమయంలో రహదారి భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, వాహనాన్ని అత్యంత అప్రమత్తంగా నడపాలని తెలిపారు. డ్రైవింగ్‌లో ఎప్పటికప్పుడు తాజా మెళకువలను నేర్చుకుంటూ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని డ్రైవర్లకు సూచించారు. విద్యార్థుల సురక్షిత రవాణా విషయంలో పాఠశాల యాజమాన్యాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. పాఠశాల బస్సులు, టాక్సీలు నడిపే డ్రైవర్లకు ఎప్పటికప్పుడు అవసరమైన శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. డ్రైవర్లు కూడా మేలైన డ్రైవింగ్ పద్ధతులు, రహదారి భద్రతా చర్యలు, వాహనాల నిర్వహణ, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై పరస్పరం చర్చించుకుని తమ అనుభవాలను పంచుకోవాలని అన్నారు. విద్యార్థుల సురక్షిత ప్రయాణం కోసం పాఠశాల యాజమాన్యాలు, డ్రైవర్లు, రవాణా శాఖ, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. విద్యార్థుల భద్రతకు సంబంధించి డ్రైవర్లకు అవసరమైన సహాయ సహకారాలను జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ అందిస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాఠశాల బస్సు డ్రైవర్లకు సురక్షిత డ్రైవింగ్ పద్ధతులు, రహదారి భద్రతా నియమాలు, వాహన నిర్వహణ, విద్యార్థుల పట్ల బాధ్యతాయుత ప్రవర్తన తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి ఎం.పురేంద్ర, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, రవాణా శాఖ అధికారులు, సిబ్బంది, పాఠశాల బస్సు, టాక్సీ డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *