Breaking News

జగనన్న వసతి దీవెన క్రింద జిల్లాలోని అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాలకు రూ.38.29 కోట్ల నగదు జమ : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాలకు 2022-23 విద్యా సంవత్సరముకు గాను నేడు జగనన్న వసతి దీవెన మొదటి విడత క్రింద రూ.38.29 కోట్ల నగదు జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. బుధవారం ఉదయం అనంతపురం జిల్లా నార్పల నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన సుమారు 9.55 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలలో రూ.912.71 కోట్ల నగదు మొత్తాన్ని వసతి దీవెన కింద కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ప్రత్యక్ష ప్రసార వీక్షణ ఏర్పాటుతో జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు, విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి వారి ప్రసంగం అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి ఏటా రెండు దఫాలలో ఐ.టి.ఐ. విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరిగ్, మెడిసన్ తదితర కోర్సులను అభ్యసించే వారికి 20 వేలు చొప్పున విద్యార్థుల తల్లుల ఖాతాలకు జమ చేస్తూ వారి చదువులకు ఆసరాగా నిలుస్తున్నారని అందులో భాగంగా నేడు 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి మొదటి విడతగా జిల్లాలోని అర్హులైన 39,960 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు రూ. రూ.38.29 కోట్ల లబ్ది జరిగిందనీ అన్నారు.

నియోజకవర్గాల వారీగా జగనన్న వసతి దీవెన క్రింద లబ్ది పొందిన వారి వివరాలు:
చంద్రగిరి నియోజకవర్గంలోని 6395 మంది తల్లుల ఖాతాలకు రూ.6.81 కోట్లు, గూడూరు నియోకవర్గం – 4990 మంది తల్లుల ఖాతాలకు రూ.5.32 కోట్లు, నగరి నియోజకవర్గం – 1976 మంది తల్లుల ఖాతాలకు రూ.2.11 కోట్లు, సత్యవేడు నియోజకవర్గం – 4519 మంది తల్లుల ఖాతాలకు రూ.4.79 కోట్లు, శ్రీకాళహస్తి నియోజకవర్గం -5485 మంది తల్లుల ఖాతాలకు రూ.5.76 కోట్లు, సూళ్ళురుపేట నియోజకవర్గం – 4918 మంది తల్లుల ఖాతాలకు రూ.5.13 కోట్లు, తిరుపతి నియోజకవర్గం – 4933 మంది తల్లుల ఖాతాలకు రూ.5.27 కోట్లు, వెంకటగిరి నియోజకవర్గం – 2858 మంది తల్లుల ఖాతాలకు రూ.3.08 కోట్లు వెరసి మొత్తం రూ.38.29 కోట్ల కు చెందిన మెగా చెక్కును జిల్లా కలెక్టర్ లబ్దిదారులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వెనుక బడిన తరగతుల సంక్షేమ మరియు సాధికార అధికారి భాస్కర్ రెడ్డి, విద్యార్థులు, తదితర అధికారులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *