-జిల్లా పర్యాటక అధికారి పి.వెంకటాచలం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
హోటల్స్ ట్రేడ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా పర్యాటక అధికారి పి.వెంకటాచలం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. హోటల్స్, లాడ్జిలు, రెస్టారెంట్లు, వెల్నెస్ సెంటర్లు.. ట్రావెల్ ఆపరేటర్స్ అందరూ ట్రేడ్ రిజిస్ట్రేషను చేసుకోవాలని పర్యాటకశాఖ ముఖ్యకార్యదర్శి ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. ట్రేడ్ రిజిస్ట్రేషను చేయించుకుంటే రాష్ట్ర ప్రభుత్వం సర్టిఫికేట్ తో పాటు, కేంద్ర ప్రభుత్వ సాతి – నిధి ఇవ్వడం జరుగుతుందని, ఈ సర్టిఫికెట్ పొందిన వారికి ఏర్యాటక ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపారు. హోటల్స్, రెస్టారెంట్స్, లాడ్జిలు, గెస్ట్ హౌస్లకు మూడు వందల రూపాయలు, హోంస్టీలు, ఫాంస్టీలకు రెండు వందల రూపాయలు, టూర్ బోటు ఆపరేటర్స్, ఎడ్వంచర్ స్పోర్ట్స్, వాటర్ స్పోర్ట్స్ ఆపరేటర్స్ – కు అయిదు వందల రూపాయలు, వెల్నెస్ సెంటర్లు, కన్వెన్షన్ హాలు, సర్వీస్ అపార్ట్ మెంట్స్ అయిదు వందల రూపాయలు నిబంధనల ప్రకారం ఏపీ టూరిజం. జిఓవి ఇన్ (www.aptourism.gov.in) వెబ్సైటు ద్వారా రిజిస్ట్రేషను చేసుకోవాలని, పూర్తి వివరాలకు జిల్లా పర్యాటక అధికారి ఫోన్ 63099 42025, -70365 30828 నెంబర్లకు సంప్రదించాలని ఆయన తెలిపారు.