Breaking News

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై అధికారులతో హోంమంత్రి సమీక్ష

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
‘వాలంటీర్లకు వందనం’ కార్యక్రమాన్ని ఈ నెల 5న ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్‌ రెడ్డి చేతుల మీదుగా కొవ్వూరులో లాంఛనంగా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను రాష్ట్ర హోంమంత్రి డాక్టర్ తానేటి వనిత, జిల్లా కలెక్టర్‌ మాధవీ లత సోమవారం పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన వివరాలు, సమావేశం ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన జగన్ మోహన్‌ రెడ్డికి స్వాగతం, వీడ్కోలు, సమావేశంలో చేపట్టబోయే పనులు, తదితర అంశాలపై తమ క్యాంపు కార్యాలయంలో అధికారులతో హోంమంత్రి సమీక్షించారు. సభా వేదిక స్థలంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్, కొవ్వూరు ఆర్డీఓ మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *