తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆద్యాత్మిక నగరం తిరుపతిలో వెలసిన గంగమ్మ దేవత స్వయానా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి చెల్లెలని, ప్రాచాన కాలం నుండి ముందుగా గంగమ్మ దేవతను దర్శించుకుని తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్ళే ఆచారం ఉండేదని రక్షణ శాఖ సలహాదారు డా.సతీష్ రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం స్థానిక తాతయ్య గుంట గంగమ్మ తల్లి పునః ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొనడానికి విచ్చేసిన రక్షణ శాఖ సలహాదారు డా.సతీష్ రెడ్డి , కుటుంబ సభ్యులకు తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, నగర మేయర్ డాక్టర్ శిరీష, తిరుపతి మున్సిపల్ కమిషనర్ డి. హరిత, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ రెడ్డి, ముద్ర నారాయణ ఆలయ మర్యాదలతో స్వాగతo పలికారు. అనంతరం నిర్మాణంలో ఉన్న ఆలయ సందర్శన, అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ పునః ప్రతిష్టాపన యజ్ఞం, యాగశాలలో ఉన్న ప్రధాన కలశము వద్ద వెండి యంత్రము మరియు బంగారపు యంత్రమును వేదపండితులు వీరి చేతులమీదుగా పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా డా.సతీష్ రెడ్డి మాట్లాడుతూ గత గంగమ్మ తల్లి వైభవాన్ని తీసుకుని రావడానికి స్థానిక శాసనసభ్యులు చేస్తున్న కృషి అభినందనీయమని, ప్రజలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు నిర్వహిస్తే గంగమ్మ దేవత ఆశీసులు అందరికీ ఉంటాయని అన్నారు. స్వయానా తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి చెల్లెలు గంగమ్మ దేవతకు గత 700 సంవత్సరాలుగా జాతరలు నిర్వహించాడo జరుగుతున్నదని దేశంలోనే జాతర ఇక్కడే మొదలైనట్లు ఆదారాలు ఉన్నాయని అన్నారు. స్వామి వారు తన చెల్లెలు గంగమ్మ దేవతకు సారె ఇవ్వడం అనావాయితీ అని, నేడు ఇదే ఆనవాయితీ దేశంలో ప్రతి కుటుంబంలో అక్కచెల్లెలకు సారె ఇవ్వడం మొదలైందని అన్నారు. నేడు ఆలయ పునరుద్ధరణ, పునః ప్రతిష్ట కార్యక్రమాలను పీటాధిపతులు స్వరూపానందస్వామి, విజయేంద్ర సరస్వతి లు పాల్గొనడం జరుగుతున్నదని అన్నారు. ఇకపై తిరుమల స్వామి వారి దర్శనానికి వెళ్ళే ముందు గంగమ్మ దేవతను దర్శించుకునే ఆచారం గుర్తు తెచ్చుకుని అందరూ భక్తీ శ్రద్ధలతో పూజించాలని అన్నారు.
నేడు 03 వ రోజు 03-05-2023 వ తేదీన శ్రీ తాతాయగుంట గంగమ్మ దేవస్థానము నందు మహా కుంభాభిషేకమహోత్సవo ఉదయం 07.00 గంటలకు గోపూజ కార్యక్రమముతో మొదలు పెట్టడం జరిగినది.
అలాగే AFCONS INFRASTRUCTURE LIMITED వారు గంగమ్మ జాతర సందర్భంగా రూ.5,00,000/-లు విరాళం తిరుపతి శాసన సభ్యులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి చేతుల మీదుగా తిరుపతి మున్సిపల్ కమిషనర్ డి. హరిత తిరుపతి కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ గారు, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, సమక్షంలో ఆలయ ఛైర్మన్ కట్టా గోపి యాదవ్, ధర్మకర్తల మండలి మరియు కార్యనిర్వహణాధికారి యం.ముని కృష్ణయ్య కి అందజేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి టి. వెంకటేశ్వరరావు, యం. హరినాథ్ రెడ్డి, పి. ధన శేఖర్, వి. గీత, యం. భారతి, ఆలయ అర్చకులు మరియు సిబ్బంది, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.