-మరో 9,098 ఎఫ్ టి వో లకు చెందిన రూ.115.69 కోట్లు రైతుల యొక్క బ్యాంకు ఖాతాకు పంపుట జరిగినది
-12,392 రైతుల నుండి 1,12,873.240 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
– జేసీ తేజ్ భరత్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
2022-23 రబీ ధాన్యం సేకరణ కు సంబంధించి రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం కు తొలివిడత గా ఇప్పటి వరకు రు.65.33 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగిందని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లాలో రబీ 2022-23 సీజన్ లో అంచనా వేసిన వరి సేకరణ 2.50 లక్షల మెట్రిక్ టన్నులు కాగా 20, 419 మంది రైతుల నుంచి 1,43, 058.559 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు కూపన్ లను జనరేట్ చెయుట జరిగిందన్నారు. ఈ రోజు వరకు 12392 రైతుల నుండి 112873.240 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. శుక్రవారం కొనుగోలు కేంద్రాల ద్వారా ఆన్ లైన్ లో 2959.560 మెట్రిక్ టన్నుల ధాన్యం, ఆఫ్ లైన్ లో 2932.817 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు తెలిపారు. తొలి విడత లో ధాన్యం కొనుగోలు చేసిన వారం రోజులలోపే 4,776 ఎఫ్ టి వో లకు గాను రూ.65.33 కోట్ల రైతుల యొక్క బ్యాంకు ఖాతాకు జమ చెయ్యుట జరిగినదన్నారు. మరో 9,098 ఎఫ్ టి వో లకు చెందిన రూ.115.69 కోట్లు రైతుల యొక్క బ్యాంకు ఖాతాకు పంపుట జరిగినదని, రాబోవు రెండు రోజులలోపు ఆ మొత్తం రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేయబడునని ఆయన పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోలు విషయమై ఏవైనా సందేహాల మరియు ఫిర్యాదులు కొరకు జిల్లా కార్యాలయం 8309487151 మరియు 08832940788 వద్ద కంట్రోల్ రూమ్‌ను ఉదయం 8.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు సంప్రదించ వచ్చునని తెలియచేశారు.