Breaking News

రైతులకు మద్దతు ధర కల్పించడం తో పాటు మిల్లర్లకు మేలు జరిగేలా చర్యలు

పెరవలి. నేటి పత్రిక ప్రజావార్త :
రబీ సీజన్ లో ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిన ధాన్యం తేమ శాతం ఎక్కువగా ఉన్నా కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర కల్పించడం తో పాటు మిల్లర్లకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి డా కారుమూరి నాగేశ్వర రావు పేర్కొన్నారు. అవసరమైతే నిర్దేశించిన లక్ష్యాలకు మించి ధాన్యం కొనుగోలు కు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ హెచ్. అరుణ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం  తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు డివిజన్ పరిధిలో పెరవలి మండలం కానూరు గ్రామంలో ఆర్భికే, రైతు లతో, మిల్లర్ల తో ముఖాముఖి లో పౌర సరఫరా కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ తో కలిసి మంత్రి పర్యటించారు.

ఈ సందర్భంగా మంత్రి కారుమూరి నాగేశ్వర రావు, రైతులతో ముఖాముఖి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రైతులు నష్టపోకుండా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చెయ్యమని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. మిల్లర్ల ద్వారా అవసరమైన గన్ని బ్యాగులను సేకరించడం జరుగుతోందన్నారు. రైతే గన్ని బ్యాగులు, హమాలీ, రవాణా సదుపాయం కల్పించుకుంటే ఆమేరకు నేరుగా రైతు ఖాతాలకు వాటిని నేరుగా చెల్లింపులు జరుపుతున్నట్లు తెలిపారు. దళారుల ప్రమేయం లేకుండా రైతులకు, మిల్లర్లకు మేలు జరిగే విధానంలో పూర్తి పారదర్శతతో ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు, రైతుల స్నేహపూర్వక ప్రభుత్వం జగగన్న ప్రభుత్వమని మంత్రి పేర్కొన్నారు. తడిసిన ధాన్యం పూర్తిగా కొనుగోలు చేసే మిల్లుకు తరలించే విధంగా అధికారులు పని చేస్తారని భరోసా ఇచ్చారు.

రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ హెచ్. అరుణ్ కుమార్ మాట్లాడుతూ, రైతులు రహదారుల పై, బహిరంగ ప్రదేశాల్లో అరపేట్టడం కోసం ఉంచిన ధాన్యం యుద్ద ప్రాతిపదికపై మిల్లులకు తరలించాలని జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ కు సూచనలు చేశారు. తేమ శాతం ఎక్కువ ఉన్న అరబెట్టే ప్రక్రియ అందుబాటులో ఉన్న దృష్ట్యా ఆమేరకు రైతులు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు చేసిన ధాన్యం కు సంబంధించి 80 శాతం పైగా నగదు రైతుల ఖాతాకు జమ చేయడం జరిగిందన్నారు. గతంలో 5ఎన్నడూ లేని విధంగా త్వరితగతిన చెల్లింపులు జరుపుతున్నట్లు తెలిపారు. క్షేత్ర స్థాయి లో పర్యటించి రైతులకు, మిల్లర్లకు సూచనలు చెయ్యడం జరిగిందన్నారు. క్షేత్ర5స్థాయిలో వాస్తవ పరిస్థితిని అంచనా వేసేందుకు  పర్యటన చెయ్యడం జరిగిందన్నారు. గౌరవ పౌర సరఫరాల మంత్రి కారుమూరి నాగేశ్వర రావు తో కలిసి రైతులతో, మిల్లర్ల తో మాట్లాడడం జరిగిందన్నారు. గన్ని బ్యాగుల కొరత, హమాలీల కొరత లేదని అన్నారు. రానున్న 20 రోజుల్లో లక్ష్యాలను సాధించడానికి అనుగుణంగా ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ లకు దిశా నిర్దేశనం చేశామని ఆయన అన్నారు.

రైతులకు మద్దతు ధర కల్పించడం లో తడిసిన ధాన్యం కొనుగోలు కు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ విషయంలో రైతులు ఆందోళన చెందనవసరం లేదని జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ అన్నారు. ప్రభుత్వం రైతులకు నష్టం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఆమేరకు మద్దతు ధర కు కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు. రైతులకు ఇబ్బంది కలిగితే 1967 నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చెయ్యవచ్చు అని పేర్కొన్నారు.

ఈ పర్యటన లో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు, ఇతర అధికారులు, రైతులు, మిల్లర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *