-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రైవేట్ ఆసుప్రతుల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను తప్పక పాటించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు వైద్యాధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ ఆలోపతిక్ ప్రేవేట్ మెడికల్ కేర్ ఎస్టాబిలిష్‌మెంట్ యాక్ట్ అమలుపై జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు శుక్రవారం ఆయన కార్యాలయం నుండి వైద్యాధికారులు జిల్లా స్థాయి సలహా కమిటీ సభ్యులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 385 ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లు, 162 క్లినిక్‌లు, 203 ల్యాబ్‌లు, ఆంధ్రప్రదేశ్ ఆలోపతిక్ ప్రేవేట్ మెడికల్ కేర్ ఎస్టాబిలిష్‌మెంట్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందన్నారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా 47 ప్రైవేటు ఆసుపత్రులు ఎంప్యానల్ చేయబడ్డాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆలోపతిక్ ప్రేవేట్ మెడికల్ కేర్ ఎస్టాబిలిష్‌మెంట్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రర్ కాబడిన ప్రైవేటు ఆసుపత్రులు మాత్రమే ప్రజలకు ఆరోగ్య సేవలను అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. యాక్ట్‌ను సమర్థవంతగా అమలు చేయడానికి ఏర్పడిన సలహా కమిటీ ప్రైవేట్ ఆసుపత్రులపై పర్యవేక్షణ చేయాలన్నారు. కమిటీ నిర్థేశించిన కాలపరిమితిలో సమావేశమై ప్రైవేటు ఆసుపత్రులపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రైవేటు ఆసుపత్రులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ను రెన్యూవల్, ష్ట్ర్‌్‌జూ:// షశ్రీఱఅఱషaశ్రీవర్‌్aష్.aజూ.స్త్రశీఙ.ఱఅ అన్‌లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆసుపత్రులలో వసతి సౌకర్యం, వైద్యులు, నర్సులు, పారామెడిక్ సిబ్బంది, సహాయక సిబ్బంది వివరాలు ఆసుపత్రులలో ప్రత్యేక వైద్య సేవలు, వైద్య పరికరాలు, ఆసుపత్రి మొక్క ఆర్థిక పరిస్థితి వంటి వివరాలతో స్టాంప్ పేపర్ డిక్లరేషన్ ఫైర్‌సేప్టీ సర్టిఫికేట్ వివరాలను పొందుపరిచి ఆసుపత్రులకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు జారీ చేయడం జరుగుతుందన్నారు. ప్రైవేటు ఆసుపత్రులు రోగులకు అందించే వైద్య సేవలకు సంబంధించి ఫీజు వివరాలు, వైద్యుల పేర్లు, వైద్య సేవలలో అర్హతలను సూచిస్తూ డిస్‌ప్లే బోర్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులలో ప్రజలకు పారదర్శకమైన వైద్య సేవలను అందించి ప్రభుత్వ లక్ష్యాలలో భాగస్వామ్యులు అయ్యేలా కమిటీ సభ్యులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు కోరారు.
జూమ్ కన్ఫరెన్స్‌లో డియంహెచ్‌వో డా. యం సుహాసిని, డిప్యూటీ డియంహెచ్‌వో డా. నళీని దేవి, అప్నా అధ్యక్షులు డా. హనుమయ్య, కార్యదర్శి డా. దినేష్‌రెడ్డి, ఉపాధ్యక్షులు డా. సూర్యనారాయణ, కమిటీ సభ్యులు ఫ్రాన్సిస్ తంబి, నందిగం జోషిబాబు, లీగల్ సెల్ శ్రీమతి మస్తానమ్మ,తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News