నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నెల్లూరులో 3వ రోజు కొనసాగుతున్న ఈ దీక్ష ఎండనక, వాననకా, ఈ రెండు మంచినీళ్ళు కూడా ముట్టకుండా గాంధీ సోషల్ వెల్ఫేర్ ట్రస్టు వ్యవస్థాపక నిర్వాహకులు ఆర్‌ఆర్ నాగరాజన్ కఠిన దీక్ష చేశారు. ఈ సందర్భంగా గాంధీనాగరాజన్ మాట్లాడుతూ ప్రజల స్పందన విదివిధాలుగా వున్నది. ఇది చాలా గొప్ప ప్రయత్నం అని ఒక ఆడపడుచు చెప్పటం, మరో వ్యక్తి, మీరు మీ ప్రయత్నం సరేకాని మీ ఆరోగ్య పరిస్థితి చూడండి అంటూ మరికొందరు ఈ సమాజాన్ని మార్చగలరా అంటూ వివిధ వ్యాఖ్యానాలు వినిపించారు. మరి నా సమాధానం సంకల్పంతో స్వచ్ఛతగా సమాజసేవే నా ఊపిరిగా భావించి ప్రజాస్వామ్యం స్పృహకోల్పోయిన స్థితి నుండి రక్షించుకోవాలి. అది ప్రజల కర్తవ్యం ఎవరు ఏది చేయలేదని మనం బాధపడుతున్నామో అది మనమెందుకు చేయకూడదు. అనే ఉద్దేశ్యంతో నా కర్తవ్యంగా నేను చేస్తున్న ఈ ప్రయత్నం మానవులు ప్రతి ఒకరిలోనూ ఉన్నతమైన శక్తి దాగి వుంటుంది. దాన్ని వెలికి తీస్తే దాని సాధ్యతను గ్రహించగలం గాంధీ మాటలో చెప్పాలంటే గెలవక పోవటం కాదు ఓటమి అంటే ప్రయత్నించకపోవటమేనేని వివరించానన్నారు. అంబేద్కర్ మాటలలో బోధించు, సమీకరించు, పోరాడు అని అన్నారు. మరి వాళ్ళ మాటలు మాత్రం కాదు. వాటిని ఆచరించిన విధం కూడా గొప్పది. మరి మనం మన సమాజ శ్రేయస్సు కొరకు చేసే ప్రయత్నం అంతో ఇంతో వుండాలిగా, మద్యాన్ని నమ్ముకుని బ్రతికే నాయకుల్ని సాయంత్రమే ఇంటికి పంపే మార్పులను తీసుకురావాలి. అదే ప్రజాస్వామ్యానికి వున్న గణత గ్రహించండి. సోషల్ మీడియా మన చేతిలో వున్నది ఉద్యమించండి… ఉద్వేగపరచండి, ఉపన్యాసాలను షేర్ చేయండి. పత్రికా ధరాన్మి కాపాడే వాళ్ళ ఆలోచనలు ఆదేశాలు ప్రజలకు అంకితం చేసే వాళ్ళని, ఆ పత్రికలను కొనుగోలు చేయండి. ప్రజాస్వామ్యాన్ని రక్షించండి. మద్యపానం నిషేదం ఎంతటి అవసరమో గుర్తించండి. భావి తరాల జీవితాలకు అది బలమైన పునాదులవ్వాలి. మారుగా సమోదులౌవ్వకూడదన్నారు. ట్రస్టు మహిళా అధ్యక్షరాలు ఆర్.ఎన్.శివరింజని, రాష్ట్ర అధ్యక్షురాలు బంగారు భారతి మరియు కొందరు సంఫీుభావం తెలిపారు. దీక్షలో భాగంగా చిన్నారులు సహకరించారు.
Tags nellore
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …