రబీంద్రనాథ్‌ ఠాగూర్‌కు ఘన నివాళి

-నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ విభాగం నేషనల్‌ వైస్‌ చైర్మన్‌ జమీల్‌ అహ్మద్‌ బేగ్‌

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరులోని లక్ష్మీపురంలో ఆదివారం రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ విభాగం నేషనల్‌ వైస్‌ చైర్మన్‌ జమీల్‌ అహ్మద్‌ బేగ్‌ రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జమీల్‌ అహ్మద్‌ బేగ్‌ మాట్లాడుతూ
భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, తన గీతాంజలి కావ్యానికి సాహిత్యంలో నోబెల్‌ బహుమతిని అందుకున్నాడు. నోబెల్‌ బహుమతిని అందుకున్న మొట్టమొదటి ఆసియావాసి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌. ఆయన రచనలలో గీతాంజలి చాలా గొప్పది. రవీంద్రుడు తాను బెంగాలీ భాషలో రచించిన భక్తిగీతాలను కొన్నింటిని ఆంగ్లంలోనికి అనువదించి గీతాంజలి అని పేరు పెట్టాడు. అది అనేక ప్రపంచ భాషలలోనికి అనువదించబడిరది. ప్రపంచ సాహిత్యంలో ఇది గొప్ప రచన. మానవుని కృంగదీసే నిరాశా నిస్పృహలను, సకల సృష్టిని ప్రేమభావంతో చూచి శ్రమ యొక్క గొప్పతనాన్ని సూచించే మహత్తర సందేశం గీతాంజలిలోని ముఖ్యాంశం. 1913 వ సంవత్సరంలో సాహిత్యానికి సంబంధించి రవీంద్రుని గీతాంజలికే నోబెల్‌ బహుమతి లభించింది. విశ్వకవి అనే బిరుదును సాధించి పెట్టింది. గీతాంజలి వెలువడిన తరువాత అన్ని దేశాలవారు రవీంద్రుని గ్రంథాలను చదవడం ఆరంభించారని జమీల్‌ అహ్మద్‌ బేగ్‌ అన్నారు. రవీంద్రుడు కేవలం రచయితగానే ఉండిపోక, బాలల హృదయాలను వికసింపచేయటానికై ప్రాచీన మునుల గురుకులాల తరహాలోనే శాంతినికేతన్‌గా ప్రసిద్ధి గాంచిన విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. అది అయిదుగురు విద్యార్థులతో మొదలై, క్రమంగా విస్తరించింది. ఆరోగ్యం కాపాడుకోవటం, పరిశుభ్రత, సత్యాన్నే పలుకుట, కాలినడక, పెద్దలను, గురువులను గౌరవించటం వారికి నేర్పేవారని జమీల్‌ అహ్మద్‌ బేగ్‌ అన్నారు. జలియన్‌వాలాబాగ్‌ మారణకాండకు వ్యతిరేకంగా బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రదానం చేసిన ‘‘సర్‌’’ బిరుదుని తృణప్రాయంగా త్యజించిన మహనీయుడికి ఆయన జయంతి సందర్భంగా నివాళి అర్పించారు. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని జమీల్‌ అహ్మద్‌బేగ్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గా శ్రీనివాస్‌, అమరేష్‌ మరియు ఆశ్రిత్‌లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *