Breaking News

నగరంలో సినీ నటి హనీ రోజ్ సందడి


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలో సినీ నటి హనీ రోజ్ సందడి చేశారు. దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్ షో రూమ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన బ్రైడల్ విభాగాన్ని ఆమె లాంఛనంగా ప్రారంభించారు. ప్రతి శుభాకార్యానికి రకరకాల బంగారు ఆభరణాలు వజ్రభారణాలు కోసం ఎక్కువ షాప్స్ తిరిగే అవసరం లేకుండా చూడగానే ఆకట్టుకునే కలెక్షన్స్ ని మహిళలు కోసం దేవి పవిత్ర షోరూం ఏర్పాటు చేయటం హర్షణీయమన్నారు. నగరంలోని జైహింద్ కాంప్లెక్స్ నందు దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమాండ్స్ షోరూం లో నూతనంగా ఏర్పాటు చేసిన బ్రెయిడల్ విభాగాన్ని ఆదివారం సినీ నటి హనీ రోజ్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… చూడగానే ఆకట్టుకునే కలెక్షన్స్ ని మా మహిళలు కోసం ఏర్పాటు చేసిన దేవి పవిత్ర షోరూం అధినేతలు వి. సుధాకర్, కే రాజేష్, వి.జగదీశ్, బ్రహ్మేంద్ర, నాగరాజు, మురళి లకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. విజయవాడ నగరం అంటే తనకు చాలా ఇష్టం అని… ఇక్కడ అభిమానులు చూపించే ప్రేమ మరువలేనిదనీ హర్షం వ్యక్తం చేశారు. షోరూం లో ఉన్న బ్రెయిడల్ కలెక్షన్స్ చాలా అద్భుతం గా ఉన్నాయనీ వెల్లడించారు. డైమండ్ సెట్ తాను ధరించి చూశాను చాలా బాగుందన్నారు. తాను తప్పక దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్ షోరూం లో డైమాండ్స్ కచ్చితంగా కొనుగోలు చేస్తానని వెల్లడించారు.విజయవాడ మహిళలు తప్పక విచ్చేసి డైమండ్ కలెక్షన్ లు వీక్షించి కొనుగోలు చేయవలసిందిగా ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా షోరూం అధినేత రాజేష్ మాట్లాడుతూ తమ కస్టమర్లకు ఎప్పటికప్పుడు నూతన మోడల్స్ ,నాణ్యత , మన్నికతో బంగారు , వజ్ర ఆభరణాలను అందిస్తున్నామని వివరించారు. వివాహ ది శుభకార్యాల కోసం బంగారు వజ్రాభరణాలు కొనుగోలు చేసే వారికి సమయం కలసి వచ్చేలా ప్రత్యేక బ్రైడల్ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తమ వద్ద రాజసం ఉట్టిపడే విక్టోరియన్ కలెక్షన్స్ తో పాటు పోల్కి డైమండ్స్, నగిషీ, కుందన బ్రైడల్ జ్యుయలరీ అందుబాటులో ఉన్నాయన్నారు. రానున్న పెళ్లిళ్ల సీజన్లో దృష్టిలో ఉంచుకుని సరికొత్త వెరైటీ డిజైన్లతో ఆభరణాలను రూపొందించి అందుబాటులో ఉంచినట్లు వివరించారు .ఈ అవకాశాన్ని విజయవాడ పరిసర ప్రాంత ప్రజల సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమం లో షోరూం అధినేత లు వి. సుధాకర్, వి. జగదీశ్, బ్రహ్మేంద్ర, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇంద్రకీలాద్రిపై భక్తులకు సరికొత్త సేవలు- రాష్ట్రంలోనే తొలిసారిగా ‘లడ్డూ ప్రసాదం ఏటీఎం’ ప్రారంభం

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం (ఇంద్రకీలాద్రి) కొండ దిగువన, అర్జునవీధి ప్రారంభంలోని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *