Breaking News

ప్రజల ద్వారా తిరిగి వచ్చిన అర్జీల పరిష్కారం కోసం తార్కిక ముగింపు చూపడం లో జిల్లా అధికారులే చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు.

రాజమహేంద్రవరం : నేటి పత్రిక ప్రజావార్త :
..స్పందనలో వచ్చిన అర్జీల సంఖ్య..141

సోమవారం ఉదయం ప్రజల నుంచి స్పందన అర్జీలను జిల్లా రెవెన్యూ అధికారి జీ. నరసింహులు తో కలిసి జాయింట్ కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ భరత్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం స్పందన ఆర్జిల పరిష్కారం కోసం అత్యంత ప్రాధాన్యత ఇస్తూన్నట్లు తెలిపారు. అందులో భాగంగా జే కే సి 1902 టోల్ ఫ్రీ నెంబర్ తీసుకొని రావడం జరిగిందన్నారు. ఆర్థిక పరమైన అంశాలు కాకుండా పరిపాలన పరంగా ఉండే అర్జీలను తార్కికంగా పరిష్కారం చెయ్యాలని స్పష్టం చేశారు. ఈరోజు స్పందనలో 141 అర్జీలు వచ్చాయని పేర్కొన్నారు.మండల ప్రత్యేక అధికారులు అందరూ మండల ప్రధాన కార్యాలయం నుండి తప్పని సరిగా స్పందనకు హాజరు కావాలన్నారు.  వారి  తదుపరి అధికారి, సిబ్బంది కలెక్టరేట్‌లో జరిగే స్పందనకు విధిగా హాజరు కావాలన్నారు. మండలాల్లో, మండల ప్రత్యేక అధికారులచే నిర్ణయించబడిన విధంగా ఎంపిడివో లేదా తహశీల్దార్ కార్యాలయంలో విధిగా ఆయా మండలాల అధికారులు  ఒకే ప్రదేశం నుండి స్పందన కు హాజరు కావాలని స్పష్టం చేశారు.  జిల్లా స్థాయి దృశ్యమాధ్యమం కోసం  వీడియో కాన్ఫరెన్స్ కి కనెక్ట్ అవ్వాలని పేర్కొన్నారు. అర్జీల రీ ఓపెన్ , పెండింగ్ కేసులను ప్రత్యేకంగా సమీక్షించండం ముఖ్యం అని జేసీ పేర్కొన్నారు.  “జగనన్న కి చెపుదాం” కార్యక్రమాన్ని  రాష్ట్ర ముఖ్యమంత్రి చే ప్రారంభించనున్న  దృష్ట్యా,  జే కే సి యొక్క ప్రాముఖ్యతను మరియు ఫిర్యాదులను పరిష్కరించడంలో అధికారులు వ్యక్తిగత శ్రద్ద తీసుకోవాలని ఆదేశించారు. మండల, డివిజనల్ స్థాయిలలో కూడా గ్రీవెన్స్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చెయ్యాలని తేజ్ భరత్ పేర్కొన్నారు.మొలకెత్తిన, తడిసిన ధాన్యం కొనుగోలు కై విజ్ఞప్తిరైతులకు ఎటువంటి నష్టం కలుగకుండా పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని జేసీ అన్నారు. అకాల వర్షాలు కారణంగా ఇబ్బందులు ఎదుర్కున్నరైతులను ఆదుకునే విషయంలో స్పష్టమైన వైఖరి తో ఉన్నట్లు, ఎటువంటి పరిస్థితి లోనూ ప్రభుత్వం పేర్కొన్న విధంగా మద్దతు ధర కి కొనుగోలు కే జిల్లా యంత్రాంగం తరపున చర్యలు తీసుకుంటామని జేసీ తెలిపారు.విశిష్ట ప్రతిభావంతుల సమస్య విన్న డిఆర్వో సోమవారం స్పందన కు వచ్చిన విశిష్ట ప్రతిభావంతుల సమస్యలను జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు స్వయంగా బయటకు వొచ్చి స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కింద కేటాయింపులు జరపాలని, స్పోర్ట్స్ కోటా, దివ్యంగుల కోట కింద పెండింగులో ఉన్న బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మీ సమస్యలను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి సత్వర పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్పందనలో కొన్ని అర్జీలు.. గోపాలపురం మండలం వేళ్ళచింతలగూడెం గ్రామానికి చెందిన ఎల్ లక్ష్మీ దుర్గ అర్జీలో తన భర్త చనిపోయారని, వారి పేరున 1.7 సెంట్లు ఉందని, తాసిల్దారు వారిని  ఆన్లైన్ చేయమని అడగ్గా  తన ఆడపడుచు అందులో వాటా ఉందని నోటీసు ఇచ్చి ఉన్నారు. తన భర్త పేరు ఉన్న  భూమిని ఆన్లైన్ చేయవలసిందిగా  వారు అర్జీలో కోరారు. రంగంపేట మండలం నల్లమిల్లి గ్రామంకు చెందిన కోటిపల్లి నాగమణి తమ అర్జీలో  2022 సంవత్సరంలో హౌసింగ్ లోన్ తో తాను ఇల్లు నిర్మించుకున్నారని, అయితే నా పేరును మంజూరైన రుణం ఇంతవరకు అకౌంట్ కు జమ కాలేదని అర్జీలు కోరారు.ఈ కార్యక్రమంలో డీఆర్వో  జి.  నరశింహులు, ,  డిసిహెచ్ఒ డా. ఎమ్. సనత్ కుమారి,  సీపీఓ కె.ప్రకాష్ రావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్. మాధవరావు, డీఎస్ఓ పి. ప్రసాదరావు, సివిల్ సప్లై జిల్లామేనేజరు నాగార్జున రెడ్డి, ఎస్ ఈ పి ఆర్ ఎ బి వి ప్రసాద్, ఎస్ ఈ ఆర్ డబ్ల్యు ఎస్ డి. బాల శంకర రావు, పలువురు జిల్లా శాఖా అధికారులు  తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *