రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం రూరల్ పిడింగొయ్యి గ్రామంలో ఎస్సీ లకు చెందిన భూ సమస్య పై పలు మార్లు మా కార్యాలయము నకు వొచ్చి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వాస్తవ పరిస్థితిని పరిశీలించేందుకు క్షేత్ర స్థాయిలో పర్యటించడానికి రావడం జరిగిందని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ తెలిపారు. మంగళవారం స్థానిక కోరుకొండ రోడ్డు ప్రాంతంలో ప్రవేటు గృహంలో విలేఖరులతో చైర్మన్ మాట్లాడుతూ, పిడింగోయ్యి సమస్య ఇక్కడకు వొచ్చి భూ పత్రాలు, కోర్టు ఆర్డర్స్, భూమి యొక్క స్థితి గతులు గానీ కూలంకుషంగా పరిశీలించి అర్థం చేసుకోవడం జరిగిందన్నారు. పిడింగోయ్యి లో ఆర్ ఎస్ నంబర్ 511 / 1సి నందు 10 ఎకరాల 66 సెంట్స్ ఉంటే అందులో 4 ఎకరాల ఒక ఎస్సీ కుటుంబానికి ఇచ్చారు. ఒక ఎకరం 60 సెంట్స్ స్మశాన వాటికకు ఉంచారు. మిగిలిన భూమిని అక్కడ హరిజన మాలలకు ఇచ్చినట్లు రికార్డుల ద్వారా తెలిసిందన్నారు. సదరు భూమిని ఎస్సీ ల ప్రయోజనం కోసం మాత్రమే సద్వినియోగం చెయ్యాలని, ఇందు కోసం కమిషన్ వారి పక్షన్న నిలుస్తుందని అన్నారు. అనంతరం క్షేత్ర స్థాయిలో పర్యటించారు.
Tags rajamendri
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …