-ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం రైతుల పక్షాన ఉంటుంది
-జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి జిల్లాలో రబీ 2022-23 సీజన్ లో అంచనా వేసిన వరి సేకరణ 3.32 లక్షల మెట్రిక్ టన్నులు లక్ష్యం లో ఈరోజు నాటికి 26280 మంది రైతుల నుంచి 178590.210 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు కూపన్ లను జనరేట్ చెయుట జరిగిందన్నారు. ఈ రోజు ఆన్ లైన్ లో 2288.600 మెట్రిక్ టన్నుల ధాన్యం మరియు ఆఫ్ లైన్ లో 1767.918 మెట్రిక్ టన్నుల ధాన్యం మొత్తం కలిపి ఈ రోజు వరకు 15899 రైతుల నుండి 145499.318 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చెయ్యడం జరిగినదన్నారు ఇందుకు గాను ధాన్యం కొనుగోలు చేసిన వారం రోజులలోపే 4776 FTO లకు గాను రూ 65.33 కోట్ల రూపాయలు రైతుల యొక్క బ్యాంకు ఖాతాకు జమ చెయ్యుట జరిగినది మరో 9098 ఫండ్ ట్రాన్సఫర్ ఆర్డర్స్ లకు గాను 115.69 కోట్లు రైతుల యొక్క బ్యాంకు ఖాతాకు పంపుట జరిగినదన్నారు. త్వరలో జమ అవుతాయని తెలిపారు. రైతులు తమ ఉత్పత్తులను 17% తేమ వరకు ఆరబెట్టుకొవాలి. రైతులకు గోనె సంచులు వినియోగ ఛార్జీలు @ రూ. 3.39 Ps., హమాలీ ఛార్జీలు @ రూ 22/- చెల్లించబడును . ధాన్యం కొనుగోలు విషయమై ఏవైనా సందేహాల మరియు ఫిర్యాదులు కొరకు జిల్లా కార్యాలయం 8309487151 మరియు 08832940788 వద్ద కంట్రోల్ రూమ్‌ను ఉదయం 8.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు సంప్రదించండి.
Prajavartha Online Telugu News