జిల్లా న్యాయమూర్తి గంధం సునీత సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారం రోజున తూర్పు గోదావరి జిల్లా న్యాయస్థాన ప్రాంగణంలో గౌరవ జిల్లా న్యాయమూర్తి గంధం సునీత వివిధ ఇన్షూరెన్స్ కంపెనీల అధికారులు, స్థానిక ఏ.పి.ఎస్. ఆర్.టి.సి అధికారులు, పిటీషనర్ల తరపు న్యాయవాదులు, ఇన్షూరెన్స్ కంపెనీల న్యాయవాదు లతో సమావేశ మయ్యారు. ఈ నెల 13వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ లో పెద్ద మొత్తంలో మోటార్ వాహనాల యాక్సిడెంట్ కేసులను పరిష్కరించేందుకు గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇన్సూరెన్స్, ఇతర సమన్వయ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం. మాధురి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి, రాజమహేంద్రవరం బార్ కౌన్సెల అధ్యక్షులు జి.యు.వి.బి.రాజు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *