తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో 2023, 2024 రెండు సంవత్సరాల మీడియా అక్రిడేషన్ల కొరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకొనుటకు ఈ నెల 18 వరకు అవకాశం కల్పించడం జరిగిందని కలెక్టర్ మరియు జిల్లా అక్రిడేషన్ కమిటీ చైర్మన్ కె.వెంకటరమణా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్ట్ లకు అక్రిడేషన్ల మంజూరు నిమిత్తం ప్రభుత్వ ఉత్తర్వులు : 38 జనరల్ అడ్మినిస్ట్రేషన్ (ఐ అండ్ పి ఆర్ ) డిపార్ట్మెంట్ తేది. 30.03.2023 జారీ మేరకు ఆన్ లైన్ లో దరఖాస్తు నిమిత్తం www.ipr.ap.gov.in వెబ్ సైట్ అందుబాటులో వుందని , సదరు జి.ఓ. మేరకు జర్నలిస్టులు తమ వివరాలతో పాటు యాజమాన్యాల సిఫారసు లేఖ, అవసరమైన డాక్యుమెంట్లు పిడిఎఫ్ ఫార్మాట్ లో అలాగే పాస్ పోర్ట్ సైజ్ ఫోటో , దరఖాస్తుదారు సంతకం ఫోటో ఫార్మాట్ లో ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాలని, అనతరం అప్ లోడ్ చేసిన డాక్యుమెంట్లు , డౌన్ లోడ్ చేసిన అప్లికేషన్ , 2 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి కార్యాలయం, తిరుపతి నందు ఈ నెల తేదీ18 లోపు అందజేయాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటన లో తెలియజేసారు.
Tags tirupathi
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …