తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి శ్రీ తాతయ్య గంగమ్మ జాతర ఉత్సవం మంగళవారం జరిగిన చాటింపుతో ప్రారంభమైదని స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఉదయం తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లికి సారె సమర్పించిన అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ తిరుపతి గంగమ్మ జాతర ఉత్సవం మంగళవారం జరిగిన చాటింపుతో ప్రారంభమైదన్నారు. గంగమ్మ దేవతది చరిత్ర కాదు, ఎప్పుడైతే శ్రీ వేంకటేశ్వర స్వామి కొండమీద కొలువయ్యారో అప్పుడే గంగమ్మ తల్లిని తన చెల్లిలిగా తీసుకొచ్చారని అవధూత గణపతి సచ్చిదానంద స్వామి ఉటంకించడం జరిగిందన్నారు.
చారిత్రక ఆధారాలను బట్టి ఇది పల్లవుల కాలం నాటి దేవాలయమని, శ్రీ వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడైన అనంతాళ్వార్ అమృత హస్తాలతో తిరిగి పునఃప్రతిష్టించిన దేవాలయమన్నారు. మళ్లీ 900 సంవత్సరాల తర్వాత ఈ తరంలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆలయ
పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కొద్దీ కాలంలోనే ఆలయ పనిలు పూర్తి చేయడం జరిగిందన్నారు. మహా కుంభాభిషేకానికి కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారు విచ్చేసి, అనుగ్రహ భాషణ చేయడం జరిగిందన్నారు. ఆ వెనువెంటనే విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర స్వామి వారు ప్రథమ దర్శనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఓ కార్యకర్తగా మా కుటుంబం తరఫున ఈ రోజు అమ్మ వారికి సారె సమర్పించడమైందన్నారు
అమ్మ వారని దర్శించిన శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి, శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర స్వామి, శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చదనంద స్వాముల వార్లు మా నిబధ్ధత, సచ్చీలత గురించి, అమ్మవారి పట్ల వున్న భక్తి గురించి వారి నోటితోనే వారు చాలా బాగా చెప్పారన్నారు. ఏదేమైనా సరే గంగమ్మ జాతర అంగరంగవైభవంగా జరుగుతుందని తెలిపారు.
Prajavartha Online Telugu News