Breaking News

మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తిరుపతిని చేయుటలో అధికారులు సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్

-మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల ను అరికట్టడానికి వివిధ ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేసి తిరుపతి జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా చేయుటలో కంకణ బద్ధులై పనిచేయాలని ఎన్ కార్డ్ (NCORD నార్కో కోఆర్డినేషన్ సెంటర్ మెకానిజం) సమావేశంలో జిల్లా కలెక్టర్ కే వెంకట రమణారెడ్డి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తో కలిసి పాల్గొని అన్నారు.

బుధవారం ఉదయం కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన చైర్మన్ హోదాలో ఎన్ కార్డ్ కు సంబంధించిన వివిధ శాఖల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ శాఖలు సమన్వయంతో పనిచేస్తే డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడం ఎంతో సులువు అవుతుందని పోలీసు సెబ్, ఫారెస్ట్, విద్యాశాఖ మరియు మార్కెటింగ్ శాఖల మధ్య సమన్వయంతో గంజాయి రవాణా మరియు నిల్వ గురించి సమాచార వినిమయం చేసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు విద్యాశాఖకు సంబంధించి డిఈఓ హెడ్మాస్టర్లు హాస్టల్ వార్డెన్ లతోను విద్యార్థుల తల్లిదండ్రులతో సెబ్ అధికారులు తరచూ సమావేశాలు నిర్వహించి గంజాయికి అలవాటు పడిన విద్యార్థులను గుర్తించి వారికి కౌన్సిలింగ్ కల్పించాలని అన్నారు. కళాశాలల్లో విద్యార్థులు డ్రగ్స్ వాడకం నివారించెందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. డ్రగ్ కంట్రోల్ అధికారి వారి ద్వారా జిల్లాలోని బల్క్ డ్రగ్ యూనిట్ ల పై పర్యవేక్షణ చేసి డ్రగ్స్ దుర్వినియోగం కాకుండా చూడాలని ఆదేశించారు. గంజాయి పెడలర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను కల్పించి వారు గంజాయి నేరములును చేయకుండా చేయాలని గంజాయి కి అలవాటు పడిన వారికి డి- అడిక్షన్ మరియు రిహబిలిటేషన్ కల్పించాలని, హెడ్మాస్టర్లు ప్రిన్సిపాల్ లు విద్యార్థులు తల్లిదండ్రులతోనూ మరియు ఉపాధ్యాయులతో హాస్టల్ వార్డెన్ లతో సమన్వయం చేసుకుంటూ విద్యార్థులకు అవగాహన కల్పించడం చేయాలని అన్నారు. కరడు కట్టిన నేరస్తులను పిడి చట్టం ప్రకారం నిర్బంధించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మెంబర్ కన్వీనర్ గా మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో గంజాయి డ్రగ్స్ పూర్తిగా రూపుమాపేందుకు డ్రగ్స్ బాధితులకు రిహబిలిటేషన్ కల్పించేందుకు అన్ని రకాల చర్యలు వివిధ శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని అన్నారు. మాదక ద్రవ్యాల రవాణా మరియు వాటిని సరఫరా చేస్తున్న నేరగాళ్లను వాసనతో పసిగట్టగలిగే మేలు రకం శునకాల ఆవశ్యకత ఎంతగానో ఉందని అన్నారు.

ఈ సందర్భంగా జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ రాజేంద్ర కమిటీకి వివరిస్తూ తిరుపతి జిల్లాలో 2023 సంవత్సరం లో నాలుగు నెలల కాలానికి సెబ్ మరియు పోలీస్ అధికారులు 30 గంజాయి కేసులు నమోదు చేసి 152 మంది ముద్దాయిలను అరెస్టు చేసి 300 కిలోల గంజాయిని స్వాధీనం పరుచుకున్నట్లు తెలిపారు. జిల్లాలో 91 డ్రగ్ ఆవేర్నెస్ కమిటీలు ఏర్పాటు చేసారని, కళాశాలలు, విద్యా సంస్థలు మరియు ప్రధాన కూడలిలో 95 హోర్డింగ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి వి శేఖర్, సబ్ డివిజనల్ ఫారెస్ట్ అధికారి, జిల్లా డ్రగ్స్ అధికారిని సుభాషిణి, పోర్టు సెక్యూరిటీ అధికారి మేజర్ వెంకటేష్ భాస్కర్, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారిని శిరీష, జిల్లా ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ సెబ్ అధికారిణి స్వాతి, ఎస్డిపిఓ చంద్రగిరి యశ్వంత్ మరియు ఏఈఎస్ శ్రీనివాస్ తిరుపతి సభ్యులుగా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *