-సరళమైన వాడుక భాషను ఉత్తర ప్రత్యుత్తరాల్లో వాడాలి
-రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానం ఆహ్వానించదగినదిగా ఉంది
-అధికారులతో సమీక్ష సమావేశం అనంతరం విలేఖర్ల సమావేశంలో
– పి.విజయ బాబు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు పరిపాలన అందచెయ్యడం లో భాగంగా ప్రభుత్వ అధికారులు సరళమైన, వాడుక భాష తెలుగులోనే ప్రత్యుత్తరాలు జరపడం సామాజిక బాధ్యత గా చేపట్టవలసి ఉందని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు పి. విజయ బాబు పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా కార్యక్రమాల లో అమలులో తెలుగు భాష అమలు చేయడం పై నిర్వహించిన సమావేశానికి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా పి. విజయబాబు మాట్లాడుతూ, మౌఖిక భాషను పాలనా భాషగా అమలు చేయడం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు ప్రయత్నం చేయాలని కోరారు. మనం ఎక్కడ ఉంటే ఆ బాధ్యతను నిర్వర్తించడం చాలా ముఖ్యం అని, తెలుగుభాష అమలు చేయాలన్న నిశ్చయం ఉండాలన్నారు. రాష్ట్రంలో తెలుగు భాషా వికాసానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూన్నట్లు పేర్కొన్నారు. అందుకు తిరిగి తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షుడు నియామకం చేపట్టడం ప్రత్యక్ష నిదర్శనం అన్నారు. రాష్ట్రంలో తెలుగుభాషా ప్రభావాన్ని సంస్కృతిని ప్రతిబింబించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తొలిసారిగా తిరుపతిలో అధికారులతో సమావేశం నిర్వహించి, రెండో సమావేశం ఇక్కడ నిర్వహిస్తూన్నట్లు విజయబాబు పేర్కొన్నారు. రాజమహేంద్రవరం తెలుగు భాషకు అమ్నలాంటిదని పి. విజయబాబు పేర్కొన్నారు. ” వేదంలా ఘోషించే గోదావరి ” పాట వింటే ఒక్క సారి అయినా రాజమండ్రి చూడాలని ప్రతీ ఒక్కరికీ అనిపించిందని తెలిపారు. మనకున్న అపూర్వమైన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాల్సి ఉందని,తమిళనాడు లో ఏవిధమైన సంస్కృతి ఉందో చూస్తున్నామని, భాష- సంస్కృతి ఒకదానికి ఒకటి సమ్మిళ్లతమై ఉండాలన్నారు. మనసు పెట్టి చేస్తే తెలుగు అమలు సాధ్యం అవుతుందని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు పి. విజయబాబు అన్నారు. పాలనా భాషా అమలు చేయాలని సంకల్పం ఉంటే తప్పనసరిగా సాధ్యం అని అన్నారు.
అనేక పదాల సమాహారం మాతృ భాష అని పేర్కొన్నారు. తెలుగు సంస్కృత, ఇటాలియన్, పార్సి తదితర ఎన్నో భాషల సమ్మిళితం అయిందని, వాడుక భాష, పాత్రికేయ పదాల నెలవులు గా వ్యవహారిక భాష అమలు చేయడం ముఖ్యం అన్నారు . అధికారులు సరళమైన భాష ను నిత్య ప్రత్యుత్తరాలు వినియోగించడం ముఖ్యం అని పేర్కొన్నారు. పదాల కూర్పు విషయంలో తగిన ఆసక్తి కలిగి ఉంటే తప్పకుండా భాష యొక్క పరిమళాన్ని కాపాడు కొనడానికి అవకాసం ఉందని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. పండింతుడు అంటే గొప్ప యోగి కావలసిన అవసరం పద ప్రయోగం ద్వారా పదాలను సృష్టించవచ్చునని అన్నారు. అధికార భాష అమలులో భాగంగా 1988 ప్రభుత్వం తెలుగు అమలు కోసం రూపొందించిన పలు ఉత్తర్వులను పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కోర్టుల ద్వారా వచ్చే తీర్పులు స్థానిక భాషలో ముద్రించి ఇచ్చే అవకాశం కోసం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కి వెళ్లి విన్నవిస్తా అని అన్నారు.
ఈ కార్యక్రమం లో జిల్లా రెవెన్యూ అధికారి జీ. నరసింహులు మాట్లాడుతూ, స్పందన ఫిర్యాదుల విషయంలో నూరు శాతం తెలుగు అమలు చేస్తున్నామని, మిగిలిన వాటిని కూడా నూరుశాతం అమలు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
జిల్లా లో గత ఏడాది గిడుగు రామ్మూర్తి పుట్టిన రోజు నుంచి కలెక్టరేట్ లో తెలుగులో ప్రతి రోజూ ఒక తెలుగు పదం, వాక్యం రాస్తున్నట్లు ఆర్డీవో ఎస్. మల్లిబాబు తెలిపారు. జిల్లా గిరిజన సంక్షేమ అధికారి జ్యోతి నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రెవెన్యూ సంబంధ మైన సర్వే, ఇతర రెవెన్యూ మార్గదర్శక సూత్రాలు తెలుగులో గ్రామ రెవెన్యూ అధికారులు పంపుతున్నట్లు తెలిపారు.
అదనపు ఎస్పీ సిహెచ్. పాపారావు మాట్లాడుతూ, పోలీసు స్టేషన్ కి వచ్చే ఫిర్యాదులు ఎఫ్ ఐ ఆర్ ను తెలుగులోనే నమోదు చేస్తున్నామని తెలిపారు.
ఈ సమావేశంలో డి ఆర్వో జి. నరసింహులు, అదనపు ఎస్పీ సిహెచ్. పాపా రావు, ఆర్డీవో ఎస్. మల్లి బాబు, ఇతర అన్ని శాఖల అధికారులు హాజరై తెలుగు అమలు చేస్తున్న విధి విధానాలను వివరించడం జరిగింది.