రుడా అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

-మేడపాటి షర్మిళ రెడ్డి టీవీ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రుడా చైర్ పర్సన్ శ్రీమతి మేడపాటి షర్మిళ రెడ్డి ఆధ్వర్యంలో రుడా పరిధిలో గల నియోజక వర్గాలలో చెరువుల సుందరీకరణకు బుధవారం శ్రీకారం. రుడా పరిధిలో వివిధ అభివృద్ధి పనులు, సుందరీకరణ భాగంగా కొత్తపేట నియోజకవర్గం లో చెరువుల సుందరీకరణకు గౌరవనీయులైన రుడా చైర్ పర్సన్ శ్రీమతి మేడపాటి షర్మిళ రెడ్డి, రుడా వైస్ చైర్ పర్సన్ బి.బాలస్వామి మరియు ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి నియోజకవర్గంలోని ఆత్రేయపురం, రావులపాలెం, గోపాలపురం, నర్సిపూడి, కొమరాజులంక గ్రామాలలోని చెరువులను సందర్శించి గ్రామాలలో చెరువులను సుందరీకరించడం జరుగుతుంది అని, వాడపల్లి కొత్త వంతెన వద్ద నుండి వెళ్లే రహదారిలో వీధిలైట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది అని శ్రీమతి మేడపాటి షర్మిళ రెడ్డి అన్నారు. ఈ మేరకు శాసనసభ్యులు చిర్ల తో కలిసి నియోజకవర్గంలోని చెరువులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా రుడా పరిధిలోని గల అన్ని నియోజకవర్గాలలో కూడా రుడా ఆధ్వర్యంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని మెడపాటి షర్మిలా రెడ్డి పేర్కొన్నారు. శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి గారు కూడా తమ నియోజకవర్గంలో కొన్ని అభివృద్ధి పనులను ప్రతిపాదించారని, వాటిని తొందరలోనే రుడా వారి బోర్డు ఆమోదం తీసుకుని పనులు ప్రారంభించడం జరుగుతుందని ఆమె తెలియ పరిచినారు.

ఈ కార్యక్రమంలో రుడా వైస్ చైర్ పర్సన్ బి.బాలస్వామి , ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి తో పాటు రుడా అధికారులు, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గోన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *