రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు గౌరవ న్యాయమూర్తుల ఆధ్వర్యంలో బుధవారం వివిధ ఇన్షూరెన్స్ కంపెనీల వారితో ముందస్తు లోక్ అదాలత్ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలో ఈ నెల 13వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారానికి సంబంధించి పిటీషనర్లు, ఇన్షూరెన్స్ కంపెనీల వారితో మరియు ఇరు పక్షాల న్యాయవాదుల మధ్య సమన్వయం కుదిర్చే విధంగా చర్చలు జరిగాయి. ఈ జాతీయ లోక్ అదాలత్ నందు అధిక మొత్తం లో కేసులు పరిష్కరించే దిశగా నల్సా వారి ఆదేశాలను పాటించాల్సిందిగా గౌరవ ప్రధాన జిల్లా న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తులు ఎం. మాధురి, ఎం. నాగేశ్వర రావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి తదితరులు పాల్గొన్నారు.
Tags rajamendri
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …