జిల్లాకు ప్రతిష్టాత్మకంగా వ్యవసాయ కళాశాల భవనాలను ఏర్పాటు చేసుకున్నాం.

-రు. 24 కోట్లతో నూతనంగా నిర్మించిన వ్యవసాయ కళాశాలను ప్రారంభించిన..
-మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఆ దిశలో మానవ వనరుల అభివృద్దే లక్ష్యంగా అనేక సంస్కరణలు తీసుకు వచ్చారని రాష్ట్ర వ్యవసాయ, సహకార మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

బుధవారం రాజమహేంద్రవరం రూరల్ మండలం కాతేరు గ్రామంలో రు. 24 కోట్ల రూపాయలతో నిర్మించిన వ్యవసాయ కళాశాల, విద్యార్థుల వసతి గృహాలను మంత్రి తానేటి వనిత, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీ మార్గాని భరత్ రామ్, శాసనసభ్యులు జక్కంపూడి రాజా , జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత తో కలసి మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి గోవర్ధన రెడ్డి మాట్లాడుతూ 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి రాజమహేంద్రవరంలో వ్యవసాయ కళాశాల ప్రారంభించారని పేర్కొన్నారు. రెండు దశాబ్దాల తరువాత నేడు ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో నూతన కళాశాల ను ప్రారంభించుకున్నామని తెలిపారు. సిఎం కు వ్యవస్థ మీద, విద్యా, మానవ వనరుల మీద, సమాజంలోని అన్ని వర్గాల మీద ఎంత చిత్తశుద్ధి ఉందనేది ఉదాహరణగా మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కళాశాలలు జాతీయ స్థాయిలో 31 స్థానం నుండి నేడు 11వ స్థానానికి వచ్చాయన్నారు. రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాల భవన సముదాయం మరియు విద్యార్థుల వసతి గృహములు రు.24 కోట్ల వ్యయం తో నిర్మించుకొని ప్రారంభించు కున్నామన్నారు. వ్యవసాయ రంగంలో భూ పోషక విలువలను గుర్తించేలా ప్రణాళికలను డాక్టర్ కాన్సెప్ట్ విధానాన్ని ముఖ్యమంత్రి తీసుకొచ్చారు.

రైతు భరోసా మాస పత్రిక ద్వారా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయంలో సాంకేతిక విధానాన్ని రైతులకు అందిస్తున్నా మని మంత్రి కాకాని గోవర్ధన రెడ్డితెలిపారు. నూతన సాంకేతిక విధానంతో వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి దిశగా వ్యవసాయ రంగం లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారు. పంట నష్టపరిహారాన్ని అంచనా వేసి అదే సీజన్లో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందిస్తున్నామని పేర్కొన్నారు.

హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ రైతు బాంధవ్యుడుగా వ్యవసాయాన్ని పండుగలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మార్చారని ఆమె పేర్కొన్నారు.

వైస్ ఛాన్స్ లర్ ఏ. విష్ణువర్ధన రెడ్డి మాట్లాడుతూ ,దేశ వ్యాప్తంగా వున్నా 74 వ్యవసాయ కళాశాలాల్లో ఐ సి ఆర్ పరీక్షలు నిర్మించగా నెంబర్ ఒన్ స్థానం లో ఏపీ ఉండటంతో కేంద్ర మంత్రి ద్వారా ఇటీవలే అవార్డు తీసుకున్నామని తెలిపారు. దేశంలో ఉన్న వ్యవసాయ విస్తీర్ణ లో 33 శాతం మనం రాష్ట్రంలో సాగు చేస్తున్నామన్నారు. ఇది టీచర్లు విద్యార్థుల ఘనతగా భావిస్తున్నానని పేర్కొన్నారు. వ్యవసాయ కళాశాలలు దేశంలోని నెంబర్ వన్ స్థానంలో ఉండేలా కృషి చేస్తామన్నారు. జాతీయ స్థాయిలో రాజమండ్రి వ్యవసాయ కళాశాలలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు ఫెలోషిప్ అవార్డులు వచ్చాయని పేర్కొన్నారు.

ఎంపీ మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో మరింత సాంకేతికతను వినియోగించుకొని అభివృద్ధికి దిశగా తీసుకు వెళ్ళాలన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా, వియత్నాంలలో వ్యవసాయ సాంకేతిక పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. విద్యార్థులు ఆధునాతన టెక్నాలజీ ద్వారా రైతులకు మరిన్ని సాంకేతికపరమైన అంశాలు పై అవగాహన కల్పించాలన్నారు.

జిల్లా కలెక్టర్ డాక్టర్ కే మాధవి లత మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి మంచి భవిష్యత్తు ఉందని, వ్యవసాయ రంగం లో ఉన్నా విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆమేరకు విజయం సాధించాలని స్పష్టం చేశారు. తాను కూడా వ్యవసాయ కళాశాలలో పూర్వపు విద్యార్థినేనని పేర్కొన్నారు.
పది సంవత్సరాల క్రితం నుంచి అద్దే భవనంలో ఉన్న కళాశాల నేడు సొంత భవనంలోకి రావడం సంతోషంగా ఉందని తెలిపారు.

కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోష్, ఎంపి మార్గని భరత్ రామ్, రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా, రూడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిల రెడ్డి, డిసిఎమ్ఎస్ చైర్మన్ శాఖ మణికుమారి ప్రసన్న కుమారి, కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్. శ్యామ్ రాజు నాయక్, కళాశాల ప్రొఫెసర్ పి ప్రవీణ, రిజిస్ట్రార్ జి. రామారావు, డీన్ సుధాకర రావు, ఇతరులు సాంబశివ రావు, కె. రవి , పలువురు ప్రజా ప్రతినిధులు, యూనివర్సిటీ డైరెక్టర్లు, విద్యార్థులు, పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *