-తూర్పు గోదావరి జిల్లాలో రాత్రి 9.30 గంటల వరకు 11 వేల కేసులు అవార్డ్ జారీ
-ఇంకా కేసులను పరిష్కరిస్తున్న బెంచ్ లు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సివిల్ తగాదాలు, రాజీ పడదగిన కేసుల పరిష్కారానికి చొరవ ఇన్సూరెన్స్ కంపెనీలు, న్యాయవాదులు, ఇతర శాఖల అధికారులు, ఇందులో భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరి సేవలు అభినందనీయమని న్యాయమూర్తి, ఏ సి బి కోర్టు మరియు ఎఫ్ ఏ సి మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి కోర్టు శ్రీ యూ యూ ప్రసాద్ అన్నారు. రాత్రి 9 .30 గంటలకు 11,000 కేసుల పైగా పరిష్కారం చేసి అవార్డ్ జారీ చేయగా, ఇంకా కొనసాగుతున్న జాతీయ లోక్ అదాలత్ కోర్టులు మరిన్ని కేసులపై తీర్పు ప్రకటించడం జరుగుతుందన్నారు. శనివారం స్థానిక కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, రాజమహేంద్రవరం వారి ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మొదటి అదనపు జిల్లా జడ్జి (ఎఫ్ ఏ సి) శ్రీ యూ యూ ప్రసాద్ మాట్లాడుతూ, కక్షి దారులకు సత్వర న్యాయం చేయాలనే లక్ష్యంతో జాతీయ లోక్ అదాలత్ జరిగే రోజున పరిష్కారం కోసం వొచ్చిన చివరి కేసు పరిష్కారం చూపే వరకు ఎంత సేపైనా వేచి చూసి సమన్యాయం కోసం న్యాయ మూర్తులు, న్యాయ వాదులు, ప్రతీ ఒక్కరూ పని చేస్తామన్నారు. రాజీ ద్వారా కేసులు సత్వర పరిష్కారం సాధ్యం అవుతుందని, ఆ దిశలో ఇరు పక్షాలు రాజీ ప్రాధాన్యత ఇవ్వాలని పలువురు న్యాయ మూర్తులు పేర్కొన్నారు. ఇందువల్ల సమయం, డబ్బు ఆదా అవ్వడం తోపాటు మంచి అనుబంధాలు ఆత్మీయతలు పెరుగుతాయని వారు పేర్కొన్నారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారం ద్వారా సత్వర న్యాయం జరిగేలా న్యాయ మూర్తులు, కోర్టులు పనిచేస్తాయని పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల్లో, కక్షి దారుల్లో లోక్ అదాలత్ లపై మరింతగా అవగాహన పెంచి సత్వర న్యాయం కోసం సామాజిక బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. ఈరోజు నిర్వహించే లోక్ అదాలత్ బెంచ్ కు వొచ్చిన కేసులకు పరిష్కారం చూపి అవార్డ్ వెల్లడించడం జరుగుతుందని పేర్కొన్నారు. కానీ అందరికి, జాతీయ లోక్ అదాలత్ జరిగే రోజున ఎంత ఆలస్యం అయినా జవాబుదారీతనంతో కేసుల పరిష్కారం చేస్తామని వారు పేర్కొన్నారు. ఇన్సూరెన్స్ కంపెనీలు , ఇతర సంస్థలు వారితో క్షుణ్ణంగా నెల రోజులుగా వారి పరిధిలో క్లైమ్స్ పరిశీలన చేసి చక్కటి పరిష్కారం చూపడం జరుగుందన్నారు. కేసులు పరిష్కారం కోసం అవసరమైన డాక్టర్ ధృవ పత్రాలు జారీకై వైద్య అధికారులు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. నిబద్ధత కలిగిన విధానంలో కేసులు పరిష్కారం కోసం తూర్పు గోదావరి జిల్లాలో 4 నూతన జిల్లాల (కాకినాడ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లా) పరిధిలో 50 బెంచ్ లలో శనివారం లోక్ అదాలత్ నిర్వహించామని పేర్కొన్నారు. ఫాక్సో, మర్డర్ వంటి కేసులు తప్ప, రాజీ ద్వారా పరిష్కారం అయ్యే అవకాశం ఉన్న కేసులకు పరిష్కారం చూపుతామని, రాజీ పడదగిన వాటికి అవార్డ్ జారీ చేస్తే ఆ తీర్పు లకు తిరుగు ఉండదన్నారు. ఉదాహరణ చెక్కు బౌన్స్ కేసులో జైలు శిక్ష, జరిమానా, పరిహారం పై జాతీయ లోక్ అధాలత్ అవార్డ్ జారీ చేయ్యావచ్చునని అన్నారు. పైన పేర్కొన్న వాటిని ఈ కోర్టు ద్వారా విచారణ ,అప్పీల్ లో ఉన్న కేసు లకు సంబంధించిన రాజీ పడితే, యదార్థం లోకి వెళ్ళ గలిగితే అన్ని తగాదాలకు పరిష్కారం సాధ్యం అవుతుందన్నారు.
జిల్లాలో కేసులు పరిష్కారం కోసం ఇన్సూరెన్స్ కంపెనీ లు, పోలీస్, ప్రభుత్వ రంగ సంస్థల, బ్యాంకుల సహకారంతో జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ ను చక్కగా నిర్వహించడం సాధ్యం అయిందని వారు పేర్కొన్నారు. జిల్లాలోని 64 కోర్టు లలో ఏర్పాటు చేసిన 50 బెంచ్ ల ద్వారా 11 వెలకి పైగా కేసులు (రాత్రి 9.30 వరకు) తూర్పు గోదావరి జిల్లా లో జాతీయ లోక్ అధాలత్ ద్వారా పరిష్కారం చేశారు.
రాజమహేంద్రవరం లో జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో ఎస్టీ ఎస్సీ మరియు పదవ అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి.. శ్రీ ఎం.నాగేశ్వరరావు, 8 వ అదనపు జిల్లా జడ్జి..శ్రీ పి ఆర్ రాజీవ్, ఫ్యామిలీ కోర్టు 9 వ అదనపు జిల్లాలో జడ్జి శ్రీమతి ఎమ్.మాధురి, సీనియర్ జిల్లా జడ్జి & డి ఎల్ ఎస్ ఏ కార్యదర్శి శ్రీమతి కె.ప్రత్యూష కుమారి , ఇతర న్యాయ మూర్తులు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు, న్యాయవాది.. శ్రీ జియువిబి రాజు, పలువురు న్యాయవాదులు , రవాణా శాఖ అధికారులు, డాక్టర్లు, ఇన్సూరెన్స్, టెలికాం కంపెనీ ప్రతినిధులు, కక్షి దారులు తదితరులు పాల్గొన్నారు.