రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(APSSDC),ఇంటర్మీడియట్ విద్యామండలి, రాష్ట్ర సమాచార సాంకేతిక అకాడమి(APITA) మరియు HCL వారి సంయుక్త ఆద్వర్యంలో 19-05-2023 తేది శుక్రవారం రాజమహేంద్రవరం ఆదిత్య డిగ్రీ కళాశాలలో హెచ్.సి.ఎల్ డ్రైవ్ నిర్యహిస్తునట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఏం కోండల రావు శనివారం ఒక ప్రకటన లో తెలిపారు. ఈ డ్రైవ్ లో 2022 & 2023 సంవత్సరంలో ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణలై ఎo.పి.సి లో 75 శాతం మార్కులు, గణితంలో 60 శాతం మార్కులు వచ్చిన వారు అర్హులు అన్నారు. ఆన్లైన్ ద్వారా ఎంపికకు పరీక్ష నిర్వహిస్తారు, ఉత్తీర్ణలు అయిన వారికీ ఏడాది పాటు ఇంటర్న షిప్ కల్పించి అనoతరం ఉద్యోగo కల్పిస్తారు. “బిట్స్ ఫీలాని, శాస్త్ర, మరియు అమిటి” వంటి ప్రముఖ యూనివర్సిటీ లలో ఉన్నత చదువులుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్ష కు సంబంధించి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ లో 10 మార్కులు, లాజికల్ రీజినింగ్ లో 10 మార్కులు, వెర్బల్ లో 10 మార్కులు వుంటాయన్నారు. ప్రతీ విబాగం నుంచి 4 మార్కులు సాదించిన విద్యార్దులకు నిర్దేశిత అంశంఫై వ్యాసరచన పోటి ఉంటుదన్నారు. ఈ డ్రైవ్ కు హాజరయ్యే అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ లింక్ bit.ly.techbee22 నందు నమోదు చేసుకొవాలని. ఆ రోజు నిర్వహించే ఇంటర్వ్యూకి పదవ తరగతి, ఇంటర్ మార్కులిస్ట్, ఆదార్ కార్డు జెరాక్ష్ కాపీలు, పాస్పోర్ట్ సైజు ఫోటోలతో హాజరుకావాలని . ఈ అవకాశాన్ని తూర్పు గోదావరి జిల్లాలోని విద్యార్దులు అందరు సద్యవినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరములకు నెంబర్ 7901284277 లేదా 8309367771 నందు సంప్రదించగలరు.
Prajavartha Online Telugu News