ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
23.05.2023న ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) భారత ప్రభుత్వం తో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని మూడు పారిశ్రామిక క్లస్టర్లలో మౌలిక సదుపాయాలైన రోడ్లు, నీటి సరఫరా వ్యవస్థలు, విద్యుత్ పంపిణీ నెట్‌వర్క్ వంటి అధిక-నాణ్యత గల అంతర్గత మౌలిక సదుపాయాల అభివృద్ధికై 141.12 మిలియన్ డాలర్ల రుణంపై సంతకం చేశాయి.. ఇది రాష్ట్రంలోని విశాఖపట్నం, శ్రీకాళహస్తి-చిత్తూరు లోని మూడు పారిశ్రామిక క్లస్టర్లలో మౌలిక సదుపాయాలను నిర్మించడానికి 2016లో ఆసియా అభివృద్ది బ్యాంకు ఈ కార్యక్రమం కోసం వినియోగిస్తున్న 500 మిలియన్ డాలర్ల మల్టీ-ట్రాంచ్ ఫైనాన్సింగ్ ఫెసిలిటీ (MFF) కింద విడుదలయ్యే రెండవ విడత ఆర్ధిక ఋణం.
ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు ఫైనాన్సింగ్ వల్ల రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో తయారీ రంగం వాటాను పెంచడానికి, పోటీతత్వాన్ని పెంపొందించడానికి, ప్రాజెక్ట్ లక్ష్య ప్రాంతాలలో ఉద్యోగాలను, ఉపాధి అవకాశాలనూ సృష్టించడానికి పారిశ్రామికీకరణను ప్రోత్సహించే దిశలో రాష్ట్రానికి మల్టీ సెక్టోరల్ విధానాన్ని అవలంబించడం ద్వారా సహాయపడుతుంది. ఈ ఋణం వల్ల విశాఖపట్నం నోడ్‌లో 160-హెక్టార్ల రాంబిల్లి, 441-హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న నక్కపల్లి పారిశ్రామిక సమూహాలలో అంతర్గత మౌలిక సదుపాయాల అభివృద్ధితో పారిశ్రామిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ఉపయోగ పడుతుంది, 13.8-కిలోమీటర్లు విస్తరించిన అచ్యుతాపురం-అనకాపల్లి రహదారి, 4.4-కిమీ విస్తరించిన నక్కపల్లి యాక్సెస్ రోడ్డును మెరుగుపరచడం ద్వారా నక్కపల్లి క్లస్టర్‌కు లబ్ది చేకూరుతుంది. ప్రతిపాదిత క్లస్టర్లలో అంతర్గత మౌలిక సదుపాయాలుగా అంతర్గత రహదారులు, తుఫాను నీటి కాలువలు, నీటి సరఫరా వ్యవస్థలు, విద్యుత్ పంపిణీ వ్యవస్థలను కలిగి ఉంటాయి. శ్రీకాళహస్తి-చిత్తూరు నోడ్‌లో, 938 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న చిత్తూరు-దక్షిణ ఇండస్ట్రియల్ క్లస్టర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి, చిత్తూరు-దక్షిణ ఇండస్ట్రియల్ క్లస్టర్‌కు 9.5-కిమీ యాక్సెస్ రహదారిని, నాయుడుపేట ఇండస్ట్రియల్ క్లస్టర్ లోని 8.7-కిమీ యాక్సెస్ రహదారిని మెరుగుపరచడానికి ఈ ప్రాజెక్ట్ సహాయపడుతుంది..
సామాజికంగా ఆర్థికంగా బలహీన వర్గాలతో సహా అనేక మందివ్యక్తుల నైపుణ్యాలను మెరుగుపరిచే దిశగా ఈ ప్రాజెక్టు ప్రణాళిక ఉంది. మార్కెటింగ్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించడంలో బ్యాంకు రాష్ట్రానికి మద్దతు ఇస్తుంది.. తీవ్రమైన వాతావరణ పరిస్థితును తట్టుకునేందుకు వీలుగా పారిశ్రామిక క్లస్టర్ ను బలోపేతం చేయడానికి, ప్రాజెక్ట్ గ్రీన్ కారిడార్ మోడల్ కార్యాచరణ మార్గదర్శకాలను ఏర్పాటు చేయడంలో, విపత్తు ప్రమాద నిర్వహణ ప్రణాళికను అభివృద్ధి చేయడంలో ఈ ప్రాజెక్టు సహాయపడుతుంది. దీర్ఘకాలిక సుస్థిరత కోసం ఉద్దేశించి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం పారిశ్రామిక క్లస్టర్‌ల నిర్వహణను మెరుగుపరచడానికి ఒక మార్గదర్శక ప్రణాళికను రూపొందిస్తుంది. ప్రాజెక్టు పరిసర ప్రాంతాలలో పారిశ్రామిక, పట్టణ ప్రణాళికలను ఏకీకృతం చేయడానికి సామాజికంగా అన్ని వర్గాలను కలుపుకొని పారిశ్రామిక సమూహాల నిర్వహణ నిమిత్తం ఆచరణ యోగ్యమైన ప్రణాళిక ఈ ప్రాజెక్టు వల్ల సాధ్యం అవుతుంది..